»Obscene Video In Whatsapp Group From Former Minister Gaddam Vinod Phone
Ex Minister: ఫోన్ నుంచి వాట్సాప్ గ్రూప్లో అశ్లీల వీడియోలు!
ఓ రాజకీయ నేత ఫోన్ నంబర్ నుంచి ఆకస్మాత్తుగా ఆశ్లీల వీడియోలు ఓ వాట్సాప్ గ్రూపులో షేర్ అయ్యాయి. అది తెలిసిన అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొంత మంది అయితే ఓ మాజీ మంత్రి ఇలా చేయడమెంటని ప్రశ్నించారు. అయితే ఆ రాజకీయ నేత ఎవరో ఇప్పుడు చుద్దాం.
Obscene video in WhatsApp group from former minister gaddam vinod phone
బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గడ్డం వినోద్(gaddam vinod) ఫోన్ నుంచి ఆశ్లీల వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఓ వాట్సాప్ గ్రూపులో అతని ఫోన్ నంబర్ నుంచి వీడియోలు పోస్ట్ అయ్యాయి. అంతే అది తెలిసిన గ్రూపులోని సభ్యులతోపాటు అనేక మంది అలా ఎలా పోస్ట్ చేశారని అతనికి ఫోన్ చేశారు. ఇది కాస్తా క్రమంగా అనేక మందికి వ్యాప్తి చెందింది. దీంతో మిగతా గ్రూపుల్లో కూడా మాజీ మంత్రి ఫోన్ నుంచి పోస్ట్ అయిన వీడియోల గురించి చర్చ మొదలైంది. అయితే దీనిపై మాజీ మంత్రి వినోద్ స్పందించారు.
ప్రస్తుతం ఆ నంబర్ తన డ్రైవర్ వాడుతున్నారని వినోద్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తాను అశ్లీల వీడియోలు పోస్ట్ చేసిన వార్త నిజం కాదని తెలిపారు. పలు సందర్భాలలో తన వాహనంలో మరో నంబర్ ఉంచుతానని చెప్పారు. ఆ ఫోన్ నంబర్(phone number) డ్రైవర్ ఉపయోగిస్తాడని వెల్లడించారు. ఆ ఫోన్ వాడుతున్న క్రమంలో డ్రైవర్ ఇలా చేశారని పేర్కొన్నాడు. ఆ వీడియో షేరింగ్ కు తనకు సంబంధం లేదని అన్నారు. అయితే వీడియో పోస్ట్ విషయం తెలిసి సోషల్ మీడియా(social media) గ్రూపుల్లో తొలగించారు. కానీ తర్వాత అది అనేక మందికి తెలియడంతో ఈ విషయంపై బెల్లంపల్లి పెద్ద చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఈ విషయాన్ని పలువురు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తలను ప్రచారం చేయోద్దని కోరారు.