»Baba Siddiki Former Minister Who Resigned From Congress Party
Baba Siddiki: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి
ఇటీవల కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా పార్టీ సభ్యత్వానికి రాజనామా చేయగా.. తాజాగా మహారాష్ట్ర మాజీ మంత్రి, సీనియర్ నేత బాబా సిద్ధిఖి కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Baba Siddiki: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. ఇటీవల కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా పార్టీ సభ్యత్వానికి రాజనామా చేశారు. తాజాగా మహారాష్ట్ర మాజీ మంత్రి, సీనియర్ నేత బాబా సిద్ధిఖి కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సిద్ధిఖి కాంగ్రెస్ పార్టీలో 48 ఏళ్ల నుంచి ఉన్నారు. యుక్త వయస్సులో ఉన్నప్పుడే సిద్ధిఖి కాంగ్రెస్‌లో అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో 48 ఏళ్ల నా సుదీర్ఘ ప్రస్థానాన్ని ముగిస్తూ.. ఇప్పుడు పార్టీ నుంచి వైదొలగుతున్నానని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఎన్నో విషయాలు చెప్పాలని అనుకున్నా.. కానీ కొన్ని విషయాలను చెప్పకుండా వదిలేయడమే బెటర్ అని తెలిపారు.
I joined the Indian National Congress party as a young teenager and it has been a significant journey lasting 48 years. Today I resign from the primary membership of the Indian National Congress Party @INCIndia with immediate effect. There’s a lot I would have liked to express…
జనవరి 14న మిలింద్ దేవరా కాంగ్రెస్‌ను వీడి శివసేనలో చేరారు. అప్పటి నుంచి బాబా సిద్ధిఖీ కూడా పార్టీని వీడే నిర్ణయం తీసుకోవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ సమయంలో అతను దానిని ఊహాగానాలు మాత్రమే కొట్టిపారేశారు. అయితే ఈరోజు ఆయనే స్వయంగా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ను వీడి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరతారని భావిస్తున్నారు. బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ ఇటీవల అజిత్ పవార్‌ను కలిశాడు. బాబా సిద్ధిఖీ బాంద్రా అసెంబ్లీ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.