మేడారం సమ్మక్క-సారలమ్మ దేవతలకు మొక్కులు, ముడుపులు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ వెసులబాటును కల్పించింది. మేడారం వెళ్లలేని భక్తులకు ఇది పెద్ద శుభవార్త అనే చెప్పాలి.
Devotees who cannot go to Medaram can pay their prayers online
Medaram: కుంభమేళా తరువాత అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. తెలంగాణలోని ములుగు జిల్లాలలో రెండు సంవత్సరాలకు ఓ సారి జరిగే ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. కేవలం తెలంగాణ నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాది భక్తులు తరలివస్తుంటారు. దాదాపు ఈ జాతరకు 4 నుంచి 5 కోట్ల మంది భక్తులు హాజరు అవుతున్నట్లు అధికారిక లెక్కలు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా జాతర జరుగుతుండగా రద్దీ పెరిగే అవకాశం ఉంది. అయితే ఆ గిరిజన దేవతలను కొలిచే భక్తులు జాతరకు వెళ్లాలను కుంటారు కానీ కొన్ని తప్పని పరిస్థితులు, ఆనారోగ్యం, వృద్దాప్యంతో వెళ్లలేని భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తమ ఇంటి నుంచే మొక్కులు, ముడుపులు సమర్పించే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కల్పించింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ సేవలను బుధవారం ప్రారంభించారు.
భక్తులు మీ సేవ, పోస్టాఫీసు, టీయాప్ ఫోలియో (TAPP Folio) ద్వారా బుక్ చేసుకొని భక్తులు మొక్కులు చెల్లించుకోవచ్చు. నిలువెత్తు బంగారాన్ని సమర్పించడం అక్కడి ఆచారం. దానికి ప్రకారం భక్తులు 1 కేజీ బెల్లం రూ.60 చొప్పున చెల్లించి నిలువెత్తు బంగారాన్ని సమర్పించడానికి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. మీ సేవా ఛార్జీలు రూ.35, పోస్టల్ ఛార్జీలు రూ.100 కలిసి ఆదనంగా చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పటికే మేడారానికి భక్తులు తరలి వెళ్తున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర, చిలకల గుట్టనుంచి సారలమ్మను తీసుకొచ్చే ఘట్టం, పూజలు నిర్వహించి మళ్లీ గుట్టకు తీసుకెళ్లే ఘట్టం జరుగుతుంది. దీనితో జాతర ముగుస్తుంది.