అవినీతి అంటూ కాంగ్రెస్ అబద్ధాలను ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల ముందు అమలు కాలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
Harish Rao: అవినీతి అంటూ కాంగ్రెస్ అబద్ధాలను ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల ముందు అమలు కాలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న చిన్న లోపాలుంటే సవరించాలే కానీ అసలు ప్రాజెక్టు మొత్తం అవినీతి అంటూ కాంగ్రెస్ అబద్ధాలను ప్రచారం చేస్తోందన్నారు. 100 రోజుల్లో 420 హామీలు నెరవేరుస్తామని వాగ్దానం చేసిన రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ను తిట్టడానికే సరిపోతుందని విమర్శించారు. అరవై రోజులవుతున్నా ఆరు గ్యారంటీలు ఇంకా అమలు కాలేదన్నారు.
కరోనా కష్టకాలంలోనూ తమ ప్రభుత్వం రైతుబంధు ఆపలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతుబంధు ఇంకా ఇవ్వలేదన్నారు. రూ.4 వేలకు పింఛను పెంపు, రైతు రుణమాఫీ ఏమైందని హరీశ్‌రావు ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కాలేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను గ్రామాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారం చేయాలని సూచించారు. రాబోయే రోజులు బీఆర్ఎస్వేనని ఎన్నికలు ఎప్పుడొచ్చినా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు.