ఉదయం లేవగానే అందరూ నోరు శుభ్రం చేసుకుంటూనే ఉంటారు. బ్రష్, టంగ్ క్లీన్ అన్నీ చేస్తారు. బ్రష్ చేసిన కాసేపటి వరకూ బానే ఉంటుంది. కానీ, కాసేపటికి అదో రకమైన వాసన వస్తుంటి. దీని వల్ల వేరేవారితో మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడతారు. దీని నుంచి బయటపడాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.
నిమ్మరసం
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపండి.
ప్రతిరోజూ ఉదయం పుక్కిలించండి.
యాంటీ సెప్టిక్ లక్షణాలు నోటి దుర్వాసనను తొలగిస్తాయి.
తులసి
5 తులసి ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించండి.
చల్లారిన తర్వాత పుక్కిలించండి.
యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటిలోని బ్యాక్టీరియాను తొలగిస్తాయి.
ఇతర చిట్కాలు
రోజుకు రెండుసార్లు రెండు నిమిషాల పాటు బ్రష్ చేయండి.
నాలుకను కూడా బ్రష్ చేయండి.
ఫ్లాస్ చేయండి.
పుష్కలంగా నీరు త్రాగండి.
ఆరోగ్యకరమైన ఆహారం తినండి.
ధూమపానం మానుకోండి.
మద్యపానం తగ్గించండి.
క్రమం తప్పకుండా దంతాల వైద్యుడిని సంప్రదించండి.