ప్రస్తుతం చాలా మంది ఎక్కువ ఏది తిన్నా జీర్ణం కాక పోవడం ఎసిడిటీ సమస్య (Acidity problem)తో బాధపడుతూ ఉంటారు.తిన్న ఆహారం సరిగా జీర్ణం అయితే ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ, ప్రస్తుత కాలంలో చాలా వరకు జీర్ణ సంబంధిత సమస్యలతోనే సతమతం అవుతున్నారు. ఫలితంగా అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అజీర్తి(indigestion), అసిడిటీ, మలబద్దకం, కడుపు ఉబ్బరం, గ్యాస్, గుండెల్లో మంట వంటి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కడుపులో మంట తగ్గాలంటే ఎసిడిటీ పోవాలంటే, కడుపు రిలీఫ్ కావాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి తెలుసుకుందాం కడుపులో మంటగా ఉన్నప్పుడు కొత్తిమీరను తీసుకుంటే కడుపులో మంట త్వరగా తగ్గుతుంది. ఒక గ్లాసు మజ్జిగలో కొద్దిగా కొత్తిమీర (Coriander) వేసుకొని తాగితే ఎసిడిటీ సమస్య నుంచి వెంటనే బయటపడవచ్చు. అంతేకాదు గ్యాస్ సమస్యకు అల్లం మంచి మందుగా పనిచేస్తుంది.
అల్లాన్ని చిన్నచిన్న ముక్కలుగా చేసుకొని రోజూ భోజనానికి ముందు కొద్దిగా అల్లాన్ని తింటే గ్యాస్ తగ్గుతుంది.చిన్న అల్లం ముక్కను తినలేము అనుకునేవారు దానిని చక్కెరతో కాని, అన్నం ముద్దలో కానీ కలిపి తీసుకుంటే ఎసిడిటీ తగ్గుతుంది. ఎసిడిటికి సమస్యకు వెల్లుల్లి చాలా సహజ సిద్ధమైన మందుగా పనిచేస్తుంది. వెల్లుల్లి (garlic) తిన్నప్పటికీ కడుపులో ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. దాల్చిన చెక్క ను నీళ్ళలో వేసి కొద్దిగా మరిగించి ఆ తర్వాత దాని జ్యూస్ ను తాగితే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.మిరియాలను పాలలో కలుపుకొని తాగితే గ్యాస్ సమస్య తగ్గుతుంది. కొబ్బరి నీళ్లు తాగినా గ్యాస్ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. ఒక కప్పు నీళ్లలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం(lemon juice), అర టీ స్పూను బేకింగ్ సోడా వేసుకుని కలుపుకుని తాగితే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
పుదీనా టీ :మీ పొట్ట మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, పుదీనా టీ (Mint T) కూడా తాగవచ్చు. పుదీనా జీర్ణవ్యవస్థలోని కండరాలను సడలించే అనేక యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలను అందిస్తుంది. ఇది మలబద్ధకం, కడుపు సంబంధిత సమస్యలను నయం చేయడంలో ఉపయోగపడుతుంది.
పెరుగు : పెరుగు తినడం ద్వారా కూడా ఉదర సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. పెరుగు (Curd) లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది తినడం వల్ల అన్ని రకాల ఉదర సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అందుకే రోజూ తాజా పెరుగును తీసుకోవాలి.మజ్జిగ చేసుకోని తాగితే కడుపు చాల్లగా ఉంటుంది.
పుచ్చకాయ :వాటర్ మిలన్ (Water Milan) చాలా ఆరోగ్యకరమైన పండు. దీనిలో ఉండే హైడ్రేటింగ్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, విటమిన్లు, ఖనిజాలు ఉదర సంబంధిత సమస్యలను అధిగమించడానికి సహాయపడతాయి. ఇందులో నీరు పుష్కలంగా ఉంటుంది.
నడవాలి : జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు నడవాలి. అయితే, రన్నింగ్, జాగింగ్(Jogging), వ్యాయామం లాంటివి చేయొద్దు. కేవలం ఒక 15 నిమిషాల పాటు అటూ ఇటూ నడిస్తే ఉపయోగం ఉంటుంది.