Governor: మరికొన్ని గంటల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రముఖులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలు, గవర్నర్ (Governor) తమిళి సై సౌందరరాజన్ (Tamilisai) ప్రజలకు పిలుపునిచ్చారు.
ఓటర్లు అందరికీ నమస్కారం అని తెలుగులో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు వేయడం అనేది ప్రాధాన్యత కలిగిన హక్కు అని తెలిపారు. ప్రతీ ఒక్కరూ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మీ ఓటు హక్కును వినియోగించుకొని, భవిష్యత్‌ను నిర్ణయించే నేతను ఎన్నుకోవాలని కోరారు.
ఓటింగ్ అంటే మారుమూల ప్రాంతాలు, పల్లెల్లో అవగాహన ఉంది. ఓటింగ్ పర్సంటేజీ కూడా పెరుగుతుంది. పట్టణాలు ముఖ్యంగా నగరాల్లో మాత్రం అవేర్ నెస్ లేదు. చదువుకున్న వారే ఓటు వేసేందుకు విముఖత వ్యక్తం చేస్తారు. దాంతో సిటీలో ఓటింగ్ పర్సంటేజీ దారుణంగా ఉంది. హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, క్రీడాకారులు ఓటేసేందుకు బారులు తీరతారు.
ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. సమస్యాత్మకంగా ఉన్న 13 నియోజకవర్గాల్లో గంట ముందు అంటే 4 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. డిసెంబర్ 3వ తేదీన తెలంగాణతోపాటు మరో 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్లను లెక్కిస్తారు.