CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో కీలక అంశాల మీద చర్చజరగనుంది. ముఖ్యంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులపై చర్చించనున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశం, మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై వారు చర్చిస్తున్నట్లు సమాాచారం. డిసెంబర్లో ప్రభుత్వం మారిన తరువాత మధ్యంతర బిల్లును మాత్రమే ప్రవేశపెట్టారు. పూర్తి స్థాయిలో బిల్లును ప్రవేశపెట్టెందుకు, అసంబ్లీ సమావేశాలు ఎప్పుడన్నది ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. గవర్నర్, సీఎంల మధ్యం దాదాపు గంట నుంచి చర్చ సాగుతోంది. రాజ్‌భవన్‌లోనే సీఎంకు సంచ్ ఏర్పాటు చేశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. సీఎం రేవంత్‌తో పాటు ఆయన సలహాదారు నరేందర్ రెడ్డి ఉన్నారు.