CM Revanth Reddy's Key Statement on Tulam Bangaram in Kalyana Lakshmi and Shadi Mubarak Schemes
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో తెలంగాణలో కులగణన చేపట్టనున్నారు. దీనిపై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కులగణన చేపడుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కులగణన తర్వాత ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ బీసీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇదే విషయాన్ని బీసీ సంఘాల నేతలు గతంలో సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని, బీసీ విద్యార్థుల పూర్తి ఫీజుల రీయింబర్స్మెంట్ అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో సీఎం వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం కులగణను నిర్వహించి, బీసీ కులాల లెక్కలు తీస్తామని సీఎం రేవంత్ రెడ్డి బీసీ నేతలకు హామీ ఇచ్చారు.