School Principal భర్తతో నిత్యం గొడవ.. పాఠశాల ప్రిన్సిపాల్ బలవన్మరణం
వెంటనే తమకు తెలిసిన కుటుంబసభ్యులు, బంధువులకు ఫోన్ లో సమాచారం అందించింది. వారు వెంటనే ఇంటికి చేరుకుని అలేఖ్యను కిందకు దించారు. అనంతరం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. ఆమె 11 ఏళ్ల కుమారుడు విజయవాడలోని ఓ హాస్టల్ లో ఉంచి చదివిస్తున్నది.
పెళ్లయి (Marriage) పదిహేన్నేళ్లయినా వారి మధ్య సఖ్యత రాలేదు. పిల్లలు పెరిగి పెద్దవుతున్నా భార్యాభర్తల (Wife and Husband) మధ్య తగ్గుముఖం పట్టాల్సిన గొడవలు (Clashes) తీవ్రమయ్యాయి. దీంతో ఆమె భర్తను వదిలేసి పిల్లలో బయటకు వచ్చింది. వచ్చి సొంతకాళ్లపై నిలబడేందుకు ప్లే స్కూల్ (Play School) ఏర్పాటు చేసింది. అయినా కూడా వేధింపుల నుంచి ఆమె తేరుకోలేదు. దీంతో అర్ధరాత్రి తన ప్రాణం తానే తీసుకుంది. పిల్లలను ఒంటరిని చేసింది. ఈ సంఘటన విశాఖపట్టణం (Visakhapatnam)లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
దశాబ్దం కిందటే కానిస్టేబుల్ (Constable) నరేశ్ తో మువ్వల అలేఖ్య (29) (Alekhya)కు వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. విశాఖలోని ఎంవీపీ కాలనీలో నివసించేవారు. ఆమె భర్త సీబీఐ విభాగంలో డిప్యూటేషన్ పై పని చేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు తగ్గుముఖం పట్టకపోగా తీవ్రమయ్యాయి. దీంతో అలేఖ్య భర్తను వదిలేసి తన ఇద్దరు పిల్లలతో కలిసి అరిలోవ ప్రాంతంలోని మయూరినగర్ కు వచ్చేసింది. ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ప్లే స్కూల్ నిర్వహిస్తున్నది. భర్తతో వేరుగా ఉంటున్నప్పటి నుంచి అలేఖ్య ముభావంగా ఉంటోంది. దీంతో జీవితంపై విరక్తితో అలేఖ్య సోమవారం అర్ధరాత్రి తన చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
తల్లి వేలాడుతుండడం చూసిన తొమ్మిదేళ్ల కుమార్తె దిగ్భ్రాంతికి గురయ్యింది. వెంటనే తమకు తెలిసిన కుటుంబసభ్యులు, బంధువులకు ఫోన్ లో సమాచారం అందించింది. వారు వెంటనే ఇంటికి చేరుకుని అలేఖ్యను కిందకు దించారు. అనంతరం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. ఆమె 11 ఏళ్ల కుమారుడు విజయవాడలోని ఓ హాస్టల్ లో ఉంచి చదివిస్తున్నది. తన కుమార్తె మృతికి అల్లుడు కారణమని అలేఖ్య తల్లి భవానీ అరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ సోమశేఖర్, ఎస్ఐ సూర్యనారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.