NLR: దగదర్తి మండలం నారాయణపురం మాజీ సర్పంచ్ వట్టికాళ్ల శ్రీనయ్య గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీనయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించి, ఆయన గ్రామాభివృద్ధికి అంకితమైన నాయకుడని ఎమ్మెల్యే కొనియాడారు.