RR: మహేశ్వరం RTC డిపో నుంచి మంఖాల్ వయా సిరిగిరిపురం, హర్షగూడ వరకు నేటి నుంచి కొత్త బస్సు నడిపించునున్నట్లు డిపో మేనేజర్ లక్ష్మీ సుధ తెలిపారు. ఈ బస్సు ఆయా గ్రామాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రయాణికులు బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు డిపో నుంచి మంఖాల్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.