SI Results ఎస్సై పరీక్ష ఫలితాలు విడుదల.. 57 వేల మంది
వేసవి కాలం (Summer) కావడంతో ఇప్పుడు దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించడంపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఈసారి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తే అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్ స్పెక్టర్ (Sub Inspectors) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 411 ఉద్యోగాలకు మొత్తం 1, 51, 288 మంది అభ్యర్థులు ప్రాథమిక పరీక్ష రాశారు. వారిలో 57, 923 మంది అర్హత సాధించారు. ఈ మేరకు ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (State Level Police Recruitment Board- SLPRB AP) మంగళవారం ఫలితాలను విడుదల చేసింది. పరీక్ష అనంతరం కీపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి తుది ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 1,553 అభ్యంతరాలు స్వీకరించినట్లు బోర్డు వెల్లడించింది. రెండు పేపర్లలో అర్హత సాధించిన వారికే దేహ దారుఢ్య (Physical Tests) పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు స్పష్టం చేసింది. జనవరి 19వ తేదీన పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
దేహ దారుఢ్య పరీక్షల షెడ్యూల్ (Schedule) ప్రకటించలేదు. వెంటనే ఆ పరీక్షలు పూర్తి చేసి జూన్ (June)లో మెయిన్స్ పరీక్ష (Mains Exams) నిర్వహించాలని బోర్డు యోచిస్తున్నది. అయితే వేసవి కాలం (Summer) కావడంతో ఇప్పుడు దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించడంపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఈసారి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తే అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎండలు అధికంగా ఉంటే ముఖ్యంగా పరుగు విషయంలో అభ్యర్థులు తీవ్రంగా అలసిపోతారు. ఈ అలసటతో వారి ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది. మరీ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఒకవేళ నిర్వహించాలనుకుంటే చాలా జాగ్రత్తలు తీసుకుని నిర్వహించాల్సి ఉంటుంది. పరీక్ష ఫలితాలకు https://slprb.ap.gov.in/లో అభ్యర్థులు చూసుకోవచ్చు.