SI Exam : రేపే తెలంగాణలో సబ్ ఇన్స్పెక్టర్ రాత పరీక్ష..
తెలంగాణలో సబ్ ఇన్స్పెక్టర్ (Sub Inspector) ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నిర్వహించే తుది రాత పరీక్ష(written test) కు సమయం అసన్నమైంది. ఏప్రిల్ 8,9,వతేదీల్లో పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరుకు, ఆప్టర్ నూన్ (After noon) 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరుకు ఎగ్జామ్ (Exam) జరగనున్నది.
తెలంగాణలో సబ్ ఇన్స్పెక్టర్ (Sub Inspector) ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నిర్వహించే తుది రాత పరీక్ష(written test) కు సమయం అసన్నమైంది. ఏప్రిల్ 8,9,వతేదీల్లో పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరుకు, ఆప్టర్ నూన్ (After noon) 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరుకు ఎగ్జామ్ (Exam) జరగనున్నది. ఇందుకు సంబంధించి ఇప్పటికే హాల్ టికెట్స్ (Hall tickets) డౌన్లోడ్ ప్రక్రియ పూర్తయింది. పరీక్షలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు.పరీక్షా నిర్వహణ కేంద్రాలుగా ఎంపిక చేసిన కళాశాలలు నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు అందుబాటులో ఉంచాలని అధికారులు సూచించారు. మహిళా అభ్యర్థులు (Female Candidates) ఎటువంటి ఇబ్బందులూ పడకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులు సూచించారు. హాల్‌టికెట్లపై అభ్యర్థులు తప్పనిసరిగా ఫొటో అతికించాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్(Hyderabad), వరంగల్, కరీంనగర్లో పరీక్షలు జరగనున్నాయి.ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ఉన్న విషయం తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station) అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభించేందుకు గాను ప్రధాని మోదీ (PM Modi) నగరానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించనున్నారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(CV Anand)తెలిపారు. ఎస్సై పరీక్షలకు (SI Exams) హాజరయ్యే అభ్యర్థులు ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవడం ఉత్తమం.ట్రాఫిక్ ఆంక్షలు ప్రారంభమయ్యేకంటే ముందే పరీక్షా సెంటర్‌కు చేరుకునేలా ప్లాన్ చేసుకోండి.