»Amit Shahs Guarantee Return Gift To Kcr On Bandi Sanjay Arrest Effect In Telangana
Amit Shah: బండికి అమిత్ షా హామీ..KCRకు రిటర్న్ గిఫ్ట్!
తెలంగాణలో BRS పార్టీకి ‘రిటర్న్ గిఫ్ట్’ ఇచ్చేందుకు బీజేపీ(BJP) సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల బెయిల్ పై విడుదలైన బండి సంజయ్(bandi sanjay)కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ఈ మేరకు ఫోన్ చేసి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటీ? అది కేసీఆర్, BRS పార్టీపై ఎలా ప్రభావం చూపుతుందని పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తెలంగాణలో పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ వ్యవహరంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్(bandi sanjay)ని రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయగా..ఒకరోజు తర్వాత బెయిల్(bail)పై విడుదలయ్యారు. విడుదలైన తర్వాత సంజయ్ అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం సహా కేసీఆర్ ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫ్యామిలీ లిక్కర్ మాఫియా, TSPSC ప్రశ్నపత్రాల స్కాంలలో చిక్కుకుని ఆ తప్పులను ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు. ఈ క్రమంలో బండి సంజయ్ తన ఇంటికి వెళ్లిన తర్వాత అమిత్ షా(Amit Shah), జేపీ నడ్డా, తరుణ్ చుగ్, స్మృతి ఇరానీ సహా బీజేపీ పెద్దలు(bjp leaders) అతనికి ఫోన్ చేసినట్లు తెలిసింది.
ఆ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah)తో కాల్లో బండి సంజయ్ తనను పోలీసులు అరెస్టు చేయడానికి దారితీసిన సంఘటనలను వివరించినట్లు సమాచారం. మరోవైపు సంజయ్ మాటలు విన్న అమిత్ షా.. .బీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వంపై పోరాటంలో ముందుకు వెళ్లాలని టీ-బీజేపీ చీఫ్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే కేసీఆర్(KCR)కి బీజేపీ నుంచి ‘రిటర్న్ గిఫ్ట్’ అందుతుందని అమిత్ షా సంజయ్‌కు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో సీబీఐ, ఈడీ విచారణలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితారావును అరెస్ట్ చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు కవిత అరెస్ట్ ఎలాగైనా తథ్యమని..అంతకంటే ‘రిటర్న్ గిఫ్ట్’ ఎక్కువ కూడా ఉండవచ్చని మరికొన్ని వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే BRSకి వ్యతిరేకంగా బీజేపీ(BJP) నిజంగా ఏదో పెద్ద ప్లాన్ వేస్తోందని టాక్. అదే జరిగితే తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగలనుందని అంటున్నారు. మరి అలాంటివి తగిలితే కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారు. ఎలా ఎదుర్కొంటారు? లేదా మళ్లీ తప్పించుకునే ప్రయత్నం చేస్తారా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.