»Bandi Sanjay Comments On Ktr His Remove From The Telangana Government Government Immediately
Bandi Sanjay: KTRను వెంటనే ప్రభుత్వం నుంచి తొలగించాలి
తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగుల ఆశలను నిర్వీర్యం చేసిన కేసీఆర్ కొడుకు కేటీఆర్(KTR)ను ప్రభుత్వం నుంచి తొలగించాలని బండి సంజయ్(Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు ప్రభుత్వం వెంటనే ఉద్యోగార్థులకు లక్ష రూపాయల నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు.
TSPSC పేపర్ లీకేజీ వ్యవహరంలో తెలంగాణ ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) డిమాండ్ చేశారు. దీంతోపాటు కేసీఆర్ కొడుకు కేటీఆర్(KTR)ను కూడా ప్రభుత్వం నుంచి బర్త్ రఫ్ చేయాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు నష్టపోయిన ఉద్యోగార్థులకు లక్ష రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరారు. మళ్లీ కేసీఆర్ జిమ్మిక్కులు చేసి తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేయాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
కేటీఆర్ 30 లక్షల కుటుంబాల యువత భవిష్యుత్తును నాశనం చేశాడని బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపించారు. ఇవన్నింటి గురించి తాను ప్రశ్నించినందుకు తనను ఇరికించాలని చూశారని సంజయ్ అన్నారు. ఇది వరకే తన కుమార్తె కవిత కేసును కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని విమర్శించారు. అసలు హిందీ పేపర్ ఏవరైనా లీక్ ఎవరైనా చేస్తారా అంటూ సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబమే లిక్కర్ కుటుంబం, లీకుల కుటుంబమని బండి సంజయ్ ఆరోపించారు.
తెలంగాణలో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం నిర్లక్ష్యం, చేతగాని తనం వల్ల ప్రస్తుతం లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని సంజయ్(Sanjay) అన్నారు. TSPSC లికేజీ కేసు(TSPSC leakage case)లో ఇప్పటివరకు 15 మందికిపైగా అరెస్టు అయ్యారని గుర్తు చేశారు. కానీ ట్విట్టర్ టిల్లు మాత్రం ఈ కేసుతో ఇద్దరికే సంబంధం ఉందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సంజయ్ పేర్కొన్నారు. దీనిపై కేటీఆర్(KTR) సమాధానం చెప్పాలని…లేదంటే బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేయించాలని కోరారు. తప్పు చేయకపోతే ఎందుకు విచారణ జరపించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దొంగలకు సపోర్టుగా ఉంటూ..ప్రతి పక్ష నేతలకు నోటీసులు పంపిస్తుందని ఎద్దేవా చేశారు. లక్షలాది మంది యువకులు కష్టపడి అనేక రోజులు చదువుకుంటే వారి కష్టాన్ని వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.