అనంతపురం ఆర్టీవో కార్యాలయం సమీపంలో పేలుడు జరిగింది. కెమికల్ డబ్బా ఓపెన్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి అపార్ట్ మెంట్ వాచ్ మెన్ సతీష్ మృతిచెందాడు.
anantapur rto office:అనంతపురం ఆర్టీవో కార్యాలయం (anantapur rto office) సమీపంలో పేలుడు (blast) సంభవించింది. కెమికల్ డబ్బా (పెయింటింగ్ డబ్బా) ఓపెన్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి అపార్ట్ మెంట్ వాచ్ మెన్ సతీష్ (sathish) శరీరం తునతునకాలైంది. శ్రీ బాలాజీ స్టిక్కర్స్ (sri balaji) దుకాణం వద్ద కెమికల్ డబ్బ నిల్వ ఉంచారు. సమీపంలో ఉన్న అపార్ట్ మెంట్ (apartment) వాచ్ మెన్‌ను విక్రయించాలని ఇచ్చారు. ఈ రోజు సతీష్ (sathish) ఓపెన్ చేయగా.. పేలుడు జరిగింది.
ఆ పెయింటింగ్ డబ్బాలు ఎక్స్ పైరీ డేట్ (expiry date) అయిపోయాయా? లేదంటే వేడికి పేలయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పేలుడు (blast) ఎందుకు జరిగిందనే అంశంపై షాప్ ఓనర్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. భారీ శబ్దం రావడంతో తొలుత గ్యాస్ సిలిండర్ పేలిందని అనుకున్నారు. దగ్గరకు వెళ్లి చూడటంతో కెమికల్ డబ్బా పేలిందని నిర్ధారించుకున్నారు.