»Andhra Pradesh Cabinet Takes Key Decisions And Approves Many Bills
Cabinet meeting : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు, పలు బిల్లులకు ఆమోదం
ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Celluboyina Venugopalakrishna) వెల్లడించారు.కేబినెట్ భేటీలో 45 అంశాలపై చర్చించగా, 15 అంశాలకు ఆమోదం లభించింది. అసెంబ్లీలో(assembly) ప్రవేశపెట్టే 20 బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇండస్ట్రియల్ పాలసీ (Industrial Policy) 2023-27కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Celluboyina Venugopalakrishna) వెల్లడించారు.కేబినెట్ భేటీలో 45 అంశాలపై చర్చించగా, 15 అంశాలకు ఆమోదం లభించింది. అసెంబ్లీలో(assembly) ప్రవేశపెట్టే 20 బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇండస్ట్రియల్ పాలసీ (Industrial Policy) 2023-27కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకు రూ.6వేల జీతంతో నైట్ వాచ్ మెన్ల నియామకానికి కేబినెట్ (Cabinet)గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు న్యాయబద్ధత కల్పించేలా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమలాపురం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (Global Investors Summit) విజయవంతం కావటంపై ముఖ్యమంత్రి జగన్ ను మంత్రులు అభినందించారని తెలిపారు. అభినందనల తీర్మానాన్ని ధర్మాన ప్రసాదరావు ప్రవేశ పెట్టారన్నారు.పెన్షన్లను ఏప్రిల్ 3వ తేదీన పంపిణీ చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఏప్రిల్ 1న ఆర్బీఐ సెలవు, 2వ తేదీన ఆదివారం కావటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఆస్కార్ అవార్డ్ (Oscar Award) సాధించిన ఆర్ఆర్ఆర్ సినిమా బృందానికి ముఖ్యమంత్రి జగన్.. క్యాబినెట్లో అభినందనలు తెలిపినట్లు మంత్రి చెప్పారు. ఎస్సీ, ఎస్సీ, బీసీ, మహిళా కమిషన్ కాలపరిమితిని మూడేళ్ల నుంచి రెండేళ్ళకు తగ్గించాలని క్యాబినెట్ నిర్ణయించిందన్నారు. అవసరమైతే రెండో టర్మ్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు.
* ఇండస్ట్రియల్ పాలసీ 2023-27కు కేబినెట్ ఆమోదం.
* మీడియా ప్రతినిధులకు అక్రిడేషన్ సదుపాయం కొనసాగింపునకు ఆమోదం.
* జిల్లా గ్రంథాలయాల సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్ళకు పెంపు.
* ఎయిడెడ్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం.
* ప్రభుత్వ హైస్కూల్స్ లో నైట్ వాచ్మెన్ల నియామకానికి ఆమోదం. నెలకు రూ.6వేల గౌరవ వేతనం. టాయిలెట్ నిర్వహణ నిధి నుంచి చెల్లించే విధంగా నిర్ణయం.
* ఏపీఐఐసీ చేసిన 50 ఎకరాల లోపు కేటాయింపులను ర్యాటిఫై చేసిన క్యాబినెట్.
* అమలాపురం కేంద్రంగా అమలాపురం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటునకు క్యాబినెట్ ఆమోదం.
* గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు న్యాయబద్ధత కల్పించేలా బిల్లు-2023కు ఆమోదం.
* అమలాపురం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
* ఎక్సైజ్ చట్టం సవరణకు ఆమోదం.
* అన్ని దేవస్థానాల బోర్డుల్లో ఒక నాయీ బ్రాహ్మణుడిని సభ్యుడిగా నియమించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
* దేవాలయాల్లో క్షుర కర్మలు చేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీసం నెలకు రూ.20వేలు కమిషన్ అందించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.
* కనీసం వంద పనిదినాలున్న క్షురకులకు ఇది వర్తింపు.
* పట్టాదారు పాస్ బుక్స్ ఆర్డినెన్స్ 2023 సవరణకు కేబినెట్ ఆమోదం.