Telangana cabinet meeting: తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ పాలనకు సంబంధించి నిర్ణాయాలు తీసుకోనుంది. అంతే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సిన ముఖ్య పథకాలు, మంత్రి వర్గ విస్తరణ తదితర అంశాలు పెండింగ్లో ఉన్నాయి. వీటి దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. దాని కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి అడిగారు. ముందు దానికి ఈసీ అనుమతి ఇవ్వలేదు. దాంతో ఆ సమావేశం జరగలేదు. ఈ రోజు ఈసీ అనుమతి ఇవ్వడంతో క్యాబినెట్ సమావేశం ఏర్పాట్లు చేస్తున్నారు.
ముందు ఈసీ నుంచి అనుమతి రాలేదు. దీంతె మంత్రి వర్గ సహచరులతో కలిసి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి అనుమతి తీసుకోవాలని భావించారు. ఇప్పుడు ఈసీ కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో ఢిల్లీ ప్రయాణం క్యాన్సెల్ అయింది. జూన్ 4వ తేదీ లోపు రాష్ట్రంలో అత్యవసర పనులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ వంటి కీలక విషయాలు చర్చించరాదని పేర్కొంది.