Rain: తెలంగాణలో రాబోవు ఐదురోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతవరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు నుంచి రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, కొన్ని ఏరియాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను సైతం జారీ చేసింది. భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, మెదక్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.
ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం పడే అవకాశం ఉంది. అలాగే మే 22న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాపాతం నమోదయ్యే ఉందని పేర్కొంది. అలాగే, మే 23న ఖమ్మం, సూర్యాపేట, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ వనపర్తి, నారాయణపేట, జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది.