»Kalyana Lakshmis Brides Scales Are Gold Since When
Kalyana Lakshmi: వివాహం చేసుకునే వధువుకు తులం బంగారం.. ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కోటిగా నెరవేరుస్తుంది. తాజాగా కల్యాణ లక్ష్మీ పథకం కింద ఇచ్చిన తులం బంగారం హామీని అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Kalyana Lakshmi's bride's scales are gold.. since when?
Kalyana Lakshmi: తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చిన ఆరుగ్యారెంటీలను ఒక్కోటిగా అమలు చేస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో ఇచ్చిన హామీలు అన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా కల్యాణలక్ష్మి పథకంలో వారు ఇస్తామన్న తులం బంగారం ఇవ్వడానికి అనుమతి ఇచ్చింది. ఈ పథకం కింద గత ప్రభుత్వం రూ. 1,00,116 అందిస్తుంది. దానికి అదనంగా ఇప్పుడు తులం బంగారం కూడా నూతన వధువుకు అందుతుంది. ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు ప్రయాణం పూర్తి స్థాయిలో అమలులో ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది.
అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పథకంలో రూ. 5 లక్షలుగా ఉన్న పరిమితిని రూ. 10 లక్షలకు పెంచింది. తాాజాగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2024-25 బడ్జెట్లో ఇందుకోసం రూ.725 కోట్ల నిధుల కేటాయించింది. తాజాగా ఆ నిధుల విడుదలకు ప్రిన్సిపల్ సెక్రటరీ బుద్ధ వెంకటేశం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కొత్తగా వివాహం చేసుకునే పేదింటి ఆడపిల్లకు నగదుతో సహా, తులం బంగారం సైతం ఇవ్వనున్నారు.