»Telangana Minister Harish Rao Emotional Speech On Brs Party Karyakartas
Siddipet చర్మం ఒలిచి చెప్పులు కుట్టిచ్చినా తక్కువే.. మంత్రి హరీశ్ రావు భావోద్వేగం
అభివృద్ధికి రాష్ట్రం సహకరించడం లేదని మోదీ చెప్పడం తెలంగాణపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోంది. రూ.30 వేల కోట్ల నిధులు మోదీ నిలిపివేశాడు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు.. కేసీఆర్ (K Chandrashekar Rao) వెన్నంటే ఉన్నవాడు.. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అగ్ర నాయకుడు.. సిద్దిపేట (Siddipet) హ్యాట్రిక్ ఎమ్మెల్యే.. కాళేశ్వరం (Kaleshwaram) నిర్మాత.. ప్రస్తుతం తెలంగాణ వైద్యారోగ్యాన్ని పరుగులు పెట్టిస్తున్న మంత్రి హరీశ్ రావు (Harish Rao). దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో కొనసాగుతున్న హరీశ్ రావు తన వెన్నంటే ఉన్న కార్యకర్తలు, నాయకులను సొంత వారిలా చూసుకుంటున్నాడు. ఈ సందర్భంగా వారిపై ఉన్న అనుబంధాన్ని తలచుకుని భావోద్వేగానికి (Emotional) లోనయ్యారు. ‘ఈ అభిమానం చూస్తుంటే నా చర్మం ఒలిచి మీకు చెప్పులు కుట్టిచ్చినా తక్కువే’ అంటూ భావోద్వేగంతో మాట్లాడారు. ఈ పరిణామం బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో చోటుచేసుకుంది.
పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు తెలంగాణవ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా సిద్దిపేట నియోజకవర్గంలోని రాఘవాపూర్ లో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి భారీగా హాజరైన కార్యకర్తలను (Karyakartas) చూసి మంత్రి హరీశ్ రావు ఖుషీ అయ్యారు. ‘మీ ప్రేమ ముందు చర్మం ఒలిచి చెప్పులు కుట్టి ఇచ్చినా తక్కువే. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనిది. ఊపిరి ఉన్నంతవరకు మీకు సేవ చేస్తా. మీ ప్రేమ, ఆప్యాయత చూస్తే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి’ అని హరీశ్ రావు మాట్లాడారు. ‘అక్కాచెల్లెళ్ల కాళ్లకు మట్టి అంటకుండా పాలన అందిస్తా’ అని తెలిపారు. ఈ మాటలకు కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలు కూడా భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీపై (Narendra Modi) హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అభివృద్ధికి రాష్ట్రం సహకరించడం లేదని మోదీ చెప్పడం తెలంగాణపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోంది. రూ.30 వేల కోట్ల నిధులు మోదీ నిలిపివేశాడు. ఢిల్లీలో కూర్చుని కాళేశ్వరం ప్రాజెక్టు దండగ అంటున్నారు.. సిద్దిపేట జిల్లాకు వచ్చి పంట పొలాలు, చెరువులను చూస్తే వారికే వాస్తవమేమిటో తెలుస్తుంది’ అని హరీశ్ రావు పేర్కొన్నారు.
సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ లో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం. 👉మీరు చూపిస్తున్న ప్రేమకు నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. 👉 మీ ఆదరణకు నేను ఎంత సేవ చేసిన తక్కువే, ఇంకా మీకు చాలా సేవ చేయాలి. 👉 మీ బలగం చూస్తుంటే ఎన్ని జన్మలు ఎత్తినా సరిపోదు, చివరి శ్వాస వరకు సేవ చేస్తా. pic.twitter.com/g5Op9Fiyky
— Office of Harish Rao (@HarishRaoOffice) April 9, 2023