»Manchu Manoj Tied The Knot With Bhuma Mounika Reddy At Hyderabad
Manchu Manoj శుభం.. వైభవంగా మంచు మనోజ్ పెళ్లి
మనోజ్, మౌనికకు చాలా ఏళ్ల నుంచే పరిచయం ఉంది. వీరిద్దరూ స్నేహితులు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే కొంతకాలంగా సహజీవనం చేసినట్లు టాక్. గతంలో చాలాసార్లు వీరిద్దరూ కలిసి కనిపించారు. ఇతర ప్రాంతాల్లో తిరుగుతూ కెమెరాలకు చిక్కారు.
యువ నటుడు మంచు మనోజ్- భూమా మౌనికల వివాహం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహం సందర్భంగా మంచు కుటుంబంలో (Manchu Family) సందడి వాతావరణం అలుముకుంది. శుక్రవారం రాత్రి జరిగిన మంచు మనోజ్ (Manchu Manoj), భూమా మౌనిక (Bhuma Mounika Reddy) పెళ్లి వేడుకకు అతి కొద్ది మంది బంధువులు, సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. కొన్ని రోజుల నుంచి మంచు మనోజ్ పెళ్లి గురించి అనేక వార్తలు వచ్చాయి. వాటిని మనోజ్, మౌనిక నిజం చేశారు.
మనోజ్ పెళ్లి సందర్భంగా మంచు వారి ఇంట (Manchu Family) సందడి నెలకొంది. ఫి మంచు లక్ష్మి పసన్న నివాసంలో ఉత్సాహ వాతావరణం అలుముకుంది. అంతకుముందు రోజు సంగీత్ (Sangeet), పసుపు (Haldi)స్నానాల వేడుక ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. ఇక శుక్రవారం రాత్రి 8.30 నిమిషాలకు శుభ ముహూర్తాన మనోజ్ మౌనిక మెడలో మూడు ముళ్లు వేశాడు. ఈ పెళ్లికి మోహన్ బాబు (Manchu Mohan Babu), మంచు విష్ణు (Manchu Vishnu), లక్ష్మీ ప్రసన్న (Manchu Laxmi Prasanna) సందడి చేశారు. బంధుమిత్రులు, సినీ, రాజకీయ ప్రముఖుల కోసం త్వరలోనే పెద్ద ఎత్తున వివాహ విందు ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది.
మనోజ్ కు 2015 సంవత్సరంలో ప్రణతి (Pranathi) అనే అమ్మాయితో వివాహమైంది. వారి మధ్య విబేధాలు రావడంతో 2019లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉన్నాడు. కాగా మౌనికకు కూడా గతంలో వివాహమైంది. ఆమె కూడా భర్తకు దూరమైంది. అయితే మనోజ్, మౌనికకు చాలా ఏళ్ల నుంచే పరిచయం ఉంది. వీరిద్దరూ స్నేహితులు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే కొంతకాలంగా సహజీవనం చేసినట్లు టాక్. గతంలో చాలాసార్లు వీరిద్దరూ కలిసి కనిపించారు. ఇతర ప్రాంతాల్లో తిరుగుతూ కెమెరాలకు చిక్కారు. గతంలోనే వీరిద్దరికి రహాస్యంగా పెళ్లయ్యిందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ అవి పుకార్లేనని తేలిపోయాయి. తాజాగా ఈ జంట పెళ్లితో ఒక్కటైంది. ఈ బంధం చిరకాలం వర్ధిల్లు అని మనం కూడా దీవించేద్దాం.