Heart Attack దేవుడా ఏమిటీ ఘోరం.. 18 ఏళ్ల బీటెక్ విద్యార్థి హఠాన్మరణం
పెద్దా లేదు.. చిన్న లేదు.. వయసుతో సంబంధం లేకుండా గుండె చప్పుడు (Heart Beat) ఆగిపోతున్నది. ఇటీవల ఇలాంటి సంఘటనలు చూస్తుంటే హృదయం ద్రవిస్తోంది. జిమ్ చేస్తుండగా.. నడుస్తుండగా.. ఆట ఆడుతుండగా.. పెళ్లిలో సంతోషంగా ఉండగా.. ఇలా సందర్భం లేదు.. ఏదీ లేదు అకస్మాత్తుగా వస్తున్న మృత్యువు వారి ఇళ్లల్లో తీవ్ర విషాదం నింపుతోంది.
చిన్ని గుండె (Heart)కు ఏదో జరుగుతోంది. అకస్మాత్తుగా ఆగిపోతున్నది. మృత్యువు (Death) ఎప్పుడూ ఎవరినీ ఎలా పిలుస్తుందో తెలియడం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గుండెపోటు (Heart Attack) వార్తలు తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. పెద్దా లేదు.. చిన్న లేదు.. వయసుతో సంబంధం లేకుండా గుండె చప్పుడు (Heart Beat) ఆగిపోతున్నది. ఇటీవల ఇలాంటి సంఘటనలు చూస్తుంటే హృదయం ద్రవిస్తోంది. జిమ్ చేస్తుండగా.. నడుస్తుండగా.. ఆట ఆడుతుండగా.. పెళ్లిలో సంతోషంగా ఉండగా.. ఇలా సందర్భం లేదు.. ఏదీ లేదు అకస్మాత్తుగా వస్తున్న మృత్యువు వారి ఇళ్లల్లో తీవ్ర విషాదం నింపుతోంది. ముఖ్యంగా తెలంగాణ (Telangana)లో అకాల మరణాలు తీవ్రంగా సంభవిస్తున్నాయి. హైదరాబాద్ (Hyderabad) పరిధిలో దాదాపు పది రోజుల వ్యవధిలో పదికి పైగా సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా 18 ఏళ్ల యువకుడు.. బీటెక్ చదువుతున్నాడు.. నడుచుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
రాజస్థాన్ (Rajastan)కు చెందిన వ్యాపారి సుచిత్ర (Suchitra)లో నివసిస్తున్నాడు. వీరి కుమారుడు సచిన్ (18) (Sachin) హైదరాబాద్ శివారులోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా (Medchal−Malkajgiri District ) గుండ్లపోచమ్మ మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయ (Kandlakoya)లో ఉన్న సీఎంఆర్ఈసీ (CMR Colleges) కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. రోజు మాదిరి శుక్రవారం కళాశాలకు వెళ్లాడు. అయితే మధ్యాహ్నం తరగతుల అనంతరం బయటకు వచ్చాడు. 3 గంటల సమయంలో కారిడార్ లో నడుస్తూనే గుండెపోటు వస్తోందని సచిన్ తోటి మిత్రులకు చెబుతూ కుప్పకూలిపోయాడు. అవతలి గోడ నుంచి ఇవతలకు పడిపోయాడు. తోటి విద్యార్థులు చూసి వెంటనే సపర్యలు చేశారు. సీఎంఆర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా విద్యార్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంతవరకు పక్కనున్న మిత్రుడు గుండెపోటుతో హఠాన్మరణం పొందడం తట్టుకోలేకపోతున్నారు. ఈ వార్త క్యాంపస్ లో తీవ్ర విషాదం నింపింది.
విద్యార్థి మృతదేహానికి కళాశాల యాజమాన్యం కుటుంబసభ్యులకు అప్పగించింది. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి సమాచారం రాలేదని సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. కాగా ఈ క్యాంపస్ తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డిది కావడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) ఇలాంటి మరణాలపై చర్యలు చేపట్టింది. సీపీఆర్ (CPR) విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ప్రస్తుతం విద్యార్థులకు కూడా సీపీఆర్ పై శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది.
కాగా ఇటీవల హైదరాబాద్ లో జిమ్ చేస్తూ కానిస్టేబుల్ విశాల్ (24), నిర్మల్ జిల్లాలో బరాత్ లో డ్యాన్స్ చేస్తూ యువకుడు ముత్యం (19), హైదరాబాద్ (Hyderabad)లోని పాతబస్తీ కాలపత్తర్ పీఎస్ పరిధిలో మహ్మద్ రబ్బానీ అనే యువకుడు, గుజరాత్ లోని (Gujarat) అహ్మదాబాద్ లో క్రికెట్ మ్యాచ్ ఆడుతుండగా ఓ వ్యక్తి ఇలా అకస్మాత్తుగా గుండెనొప్పితో వారంతా మృతి చెందారు. క్షణాల్లో వారి ప్రాణం పోతుంది. ఆస్పత్రికి వెళ్తే అప్పటికే చనిపోయాడనే చేదు వార్త వినిపిస్తోంది. ఈ సంఘటనల నేపథ్యంలో ఇకనైనా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు.