»Street Dogs Attack On Political Leaders In Basara And Nandyal
Dogs Attack ఇప్పుడు నాయకుల వంతు.. మాజీ మంత్రి, ఎంపీపీపై కుక్కల దాడి
హైదరాబాద్ లో బాలుడి మృతి సంఘటనను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) వదిలిపెట్టడం లేదు. హైదరాబాద్ మేయర్ ను లక్ష్యంగా చేసుకుని ఆయన వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ సందర్భంగా మేయర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాడు.
తెలంగాణ (Telangana)లో బాలుడి ప్రాణం తీసినప్పటి నుంచి గ్రామ సింహాల (Street Dogs) దాడులు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రా (Telugu States)ల్లో వారం వ్యవధిలో దాదాపు వందల సంఖ్యలో కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. రోజు ఇరు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో వీధికుక్కల (Dogs Attack) దాడి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పసి పిల్లలు, యువకులే కాకుండా వృద్ధులపైకి కూడా దాడికి ఎగబడుతున్నాయి. అయితే ఇన్నాళ్లు సాధారణ ప్రజలపై ప్రతాపం చూపించిన గ్రామ సింహాలు ఇప్పుడు రాజకీయ నాయకులపై దాడులు చేస్తున్నాయి. తెలంగాణలో ఎంపీపీ (MPP) భర్తపై దాడికి పాల్పడగా.. ఏపీలో మాజీ మంత్రి (Farmer Minister) కుమారుడిపై ఎగబడ్డాయి.
నిర్మల్ జిల్లా (Nirmal District) బాసర (Basara) మండలంలో కుక్క కాటు సంఘటనలు పెరిగాయి. ఐదు రోజుల వ్యవధిలో మూడు సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా బిద్రేల్లి గ్రామంలో శుక్రవారం ఎంపీపీ సునీత భర్త, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు విశ్వనాథ్ పటేల్ పై కుక్కదాడికి పాల్పడింది. దీంతో అతడి కాలికి తీవ్ర గాయమైంది. వెంటనే ఆస్పత్రిలో చేరిపోయాడు. గతంలో బాసర ట్రిపుల్ ఐటీలో ఇద్దరు విద్యార్థులపై కూడా దాడి చేశాయి.
ఇక ఏపీలోని నంద్యాల జిల్లా (Nandyal District)లో మాజీ మంత్రి కుమారుడిపై శునకాలు తమ ప్రతాపం చూపించాయి. పార్టీ ప్రచారంలో పాల్గొనగా అతడిపై దాడికి పాల్పడ్డాయి. ఎమ్మెల్సీ ఎన్నికలలో (MLC Elections) భాగంగా నంద్యాలలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్ఎండీ ఫరూక్ (NMD Farooq) కుమారుడు ఫిరోజ్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం స్థానికంగా ప్రచారంలో ఉండగా ఫిరోజ్ పై కుక్క దాడి చేసింది. అతడిని కరవడంతో వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందించారు. హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇలా నాయకులపై గ్రామసింహాలు దాడులకు పాల్పడ్డాయి.
ఇక హైదరాబాద్ లో బాలుడి మృతి సంఘటనను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) వదిలిపెట్టడం లేదు. హైదరాబాద్ మేయర్ ను లక్ష్యంగా చేసుకుని ఆయన వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ సందర్భంగా మేయర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాడు. కాగా బాధిత కుటుంబానికి జీహెచ్ఎంసీ రూ.10 లక్షలు పరిహారంగా ప్రకటించింది. త్వరలోనే ఆ కుటుంబానికి సహాయం అందించనున్నారు. రామ్ గోపాల్ వర్మ కూడా బాధిత కుటుంబానికి సహాయం అందించాలని తన ఫాలోవర్లను కోరాడు. ఈ మేరకు బాధిత కుటుంబ బ్యాంక్ ఖాతా వివరాలను ట్విటర్ లో పోస్టు చేశాడు.