Road Accident : లారీని ఢీకొన్న కారు.. వధూవరులు సహా ఐదుగురు మృతి
నంద్యాల జిల్లా నల్లగట్ల వద్ద ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Five people from Amalapuram died in an American road accident
5 Dead in Nandyal District: తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన సికింద్రాబాద్ వ్యక్తులు మార్గ మధ్యంలో మృతి చెందారు. ఫిబ్రవరి 29న వివాహం జరిగిన వధూ వరులు సహా ఐదుగురు కారులో ప్రయాణిస్తున్నారు. ఆగి ఉన్న లారీని ఈ కారు వేగంగా ఢీ కొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. నంద్యాల జిల్లా(Nandyal District) ఆళ్లగడ్డ మండలం, నల్లగట్ల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దుర్ఘటన జరిగిన తీరుపై దర్యాప్తు చేపట్టారు. వారు తెలిపిన వివరాల ప్రకారం… మృతులంతా సికింద్రాబాద్లోని వెస్ట్ వెంకటాపురానికి చెందిన వారు. మృతుల్లో వధూవరులు బాల కిరణ్, కావ్య మృతి చెందారు.
వీరికి వివాహం తర్వాత ఈ నెల మూడో తారీఖున షామీర్ పేటలో రిసెప్షన్ జరిగింది. తర్వాత వీరు తిరుపతి వెంకటేశ్వరుని దర్శనానికి కారులో బయలు దేరి వెళ్లారు. తిరిగి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం(Road Accident) జరగడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. బాలకిరణ్ తల్లిదండ్రులు లక్ష్మి, రవికుమార్ సహా మరో బాలుడు కూడా ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయారు.