Teacher కీచకుడు.. మైనర్‌కు తాళి కట్టి, ఆపై లైంగికదాడి
ఓ విద్యార్థిని ప్రేమిస్తున్నానని టీచర్ మోసం చేశాడు. ఇంటికి తీసుకెళ్లి తాళి కట్టాడు. పెళ్లి అయ్యింది కదా అని.. ఆపై లైంగికదాడి చేశాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది.
Teacher: ఉపాధ్యాయులకు సమాజంలో మంచి స్థానం ఉంది. గౌరవం కూడా లభిస్తోంది. కొందరు మాత్రం తమ ప్రొఫెషన్‌కు చెడ్డపేరు తీసుకొస్తున్నారు. అవును.. విద్యార్థినీల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. ఓ స్టూడెంట్‌పై టీచర్ (Teacher) లైంగికదాడికి తెగబడ్డ ఘటన కలకలం రేపింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. భీమవరం గ్రామీణ మండలం తాడేరుకు చెందిన పురెళ్ల సోమరాజు మరో మండలంలో హిందీ టీచర్‌గా (Teacher) పనిచేస్తున్నాడు. అక్కడ ఓ విద్యార్థిని పట్ల ఇష్టం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో వెంట పడ్డాడు. పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పాడు. ఈ నెల 19వ తేదీన తాడేరు తీసుకెళ్లాడు. అక్కడ ఆ విద్యార్థినికి తాళి కట్టాడు. ఇంకేముంది.. ఆ తర్వాత పెళ్లి అయ్యింది కదా అని లైంగికదాడి చేశాడు.
విద్యార్థిని మైనర్.. బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో గమ్మున ఉంది. అదోలా ఉండటంతో.. ఏం జరిగిందని పేరంట్స్ అడిగారు. విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ టీచర్‌పై లైంగికదాడి, ఫోక్సో, బాల్య వివాహ నిరోధక చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు. దిశ డీఎస్పీ ఎన్ మురళికృష్ణకు కేసు బాధ్యతలను అప్పగించారు.