»Minor Brutally Murdered Teenager For Just Rs 350 In Delhi
Delhi: ఢిల్లీలో దారుణం.. రూ.350కోసం 60సార్లు కత్తితో పొడిచి.. ఆపై డ్యాన్స్ చేసి..
దేశ రాజధానిలో దారుణం చోటు చేసుకుంది. మంగళవారం ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో హృదయ విదారకమైన కేసు వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.350 కోసం ఓ మైనర్ 17 ఏళ్ల బాలుడిని హత్య చేశాడు.
Delhi: దేశ రాజధానిలో దారుణం చోటు చేసుకుంది. మంగళవారం ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో హృదయ విదారకమైన కేసు వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.350 కోసం ఓ మైనర్ 17 ఏళ్ల బాలుడిని హత్య చేశాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఈరోజు బయటికి వచ్చింది. ఈ ఫుటేజీని చూసిన తర్వాత ఎవరికైన వణుకుడు వచ్చేంత భయంకరంగా ఉంది. 16 ఏళ్ల బాలుడు బాధితుడిపై కనీసం 60 సార్లు కత్తితో దారుణంగా దాడి చేశాడు. మెడ కోసేందుకు ప్రయత్నించారు. అతని తలను తన్ని రక్తంతో తడిసిన అతని శరీరాన్ని ఇరుకైన సందులోకి లాగి అతని మృతదేహం ముందు నృత్యం చేయడం ప్రారంభించాడు.ః
మంగళవారం రాత్రి 10:20 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీలో వెల్లడైంది. పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. పోస్టుమార్టం నివేదికలో మృతుడి మెడ, చెవులు, ముఖంపై కత్తితో దాడి చేసిన గుర్తులు ఉన్నాయి. మృతుడి శరీరంపై 60 కత్తిపోట్లు కనిపించాయి. పోలీసులు బుధవారం ఉదయం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై హత్య కేసు నమోదైంది. దాడి జరిగిన సమయంలో యువకుడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతుడు జఫ్రాబాద్ వాసిగా గుర్తించారు.
పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. జనతా మజ్దూర్ కాలనీ సమీపంలో నిందితులు బాధిత యువకుడిని పట్టుకుని బిర్యానీ తినేందుకు డబ్బులు అడగడం మొదలుపెట్టారు. బాధితుడు నిరసన తెలపడంతో నిందితులు గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించారు. నిందితుడు డబ్బులు ఇవ్వకపోవడంతో కత్తి తీసి దాడికి దిగాడు. ఒకటి తర్వాత ఒకటి కత్తితో దాదాపు 50 సార్లకు పైగా పొడిచాడు. ఆ తర్వాత మృతుడి జేబులోంచి రూ.350 తీసి మృతదేహం దగ్గర డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.