Animal Trailer: తండ్రిని పిచ్చిగా ప్రేమించే కొడుకు
యంగ్ టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న నటించిన యానిమల్ ట్రైలర్ వచ్చేసింది. ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.
Animal Trailer: టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యానిమల్ చిత్రంపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. తాజాగా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. 3 నిమిషాల 33 సెకన్లు ఉన్న ఈ వీడియోలో కథ ఏంటో కొంచె హింట్ ఇచ్చారు దర్శకుడు. ట్రైలర్ స్టార్టింగ్లోనే తండ్రి కొడుకులు తమ పాత్రలు మార్చుకోవడం, తన ఫాదర్ ఎలా ప్రవర్తించేవాడో చెప్పే సీన్ వినుత్నంగా ఉంది. నాన్నను విపరీతంగా ప్రేమించే కొడుకు గ్యాంగ్స్టర్గా ఎందుకు మారాడు అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక ట్రైలర్లో లాస్ట్ షాట్ బాబీ డియోల్ సిగరేట్ తాగేది చాలా ఇంప్రెస్సీవ్గా ఉంది. ప్రేక్షకుల అంచనాలను తగ్గించడానికి ట్రైలర్లో జాగ్రత్త పడ్డారు అనిపిస్తుంది. ఇక యానిమల్ పూర్తి విశ్వరూపం చూడడానికి ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
T-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 1 విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఇక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది.