»Govt Teacher And Congress Leader Dies With Heart Attack In Telugu States
Heart attack పాఠాలు చెబుతూ టీచర్.. తాళం వేస్తూ కాంగ్రెస్ నాయకుడు మృతి
పది రోజుల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో (Telugu States)నే దాదాపు 15 మందికి పైగా గుండెపోటుతో మృతి చెందారు. ఇక దేశవ్యాప్తంగా ఎంత మంది చనిపోయారో తెలియదు. కానీ ఉన్నపాటులా కుప్పకూలిపోతున్నారు.. క్షణాల్లో జీవి విడిస్తున్నారు. మానవుడి గుండెలో ఏం జరుగుతుందో తెలియడం లేదు.
హృద్రోగ సమస్యల (Heart Problems)తో ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. పది రోజుల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో (Telugu States)నే దాదాపు 15 మందికి పైగా గుండెపోటుతో మృతి చెందారు. ఇక దేశవ్యాప్తంగా ఎంత మంది చనిపోయారో తెలియదు. కానీ ఉన్నపాటులా కుప్పకూలిపోతున్నారు.. క్షణాల్లో జీవి విడిస్తున్నారు. మానవుడి గుండెలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. మారిన వాతావరణ పరిస్థితులా… కాలమా తెలియడం లేదు కానీ చేతికొచ్చిన వారు.. నవ యువకులు ప్రాణం వదిలేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఉపాధ్యాయుడు (Govt Teacher).. తెలంగాణ (Telangana)లో తలుపుకు తాళం వేసి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) నాయకుడు కుప్పకూలిపోయారు. అంతే అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
తెలంగాణలో..
పెద్దపల్లి జిల్లా (Pedapalli District) డీసీసీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ (Raj Thakur Makkan Singh)) సోదరుడు శైలేంద్ర సింగ్. గోదావరిఖని (Godavarikhani)లో నివసిస్తున్నాడు. మార్చి 3న శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా ఇంటి తలుపునకు తాళం (Lock) వేసి లిఫ్ట్ (Lift) వద్దకు వెళ్లాడు. లిఫ్ట్ వచ్చే వరకు పక్కకు జరిగాడు. గోడ మీద నిలబడుతూ అలా రెండడుగులు ముందుకు వెళ్లాడు. అంతే ఏం జరిగిందో తెలియదు కానీ కుప్పకూలిపోయాడు. పట్టుకున్న సూట్ కేసుపైనే కిందపడ్డాడు. పక్కనే ఉన్న గోడను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ కూలిపోయాడు. క్షణాల వ్యవధిలో ప్రాణం వదిలాడు. ఇంకేముంది ఆస్పత్రికి తరలించగా వైద్యులు గుండెపోటుతో మృతి చెందాడని చెప్పారు. తీవ్ర స్థాయిలో గుండెపోటు రావడంతో చనిపోయాడని చెప్పాడు. దీంతో రాజ్ ఠాకూర్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. శైలేందర్ రెడ్డి మృతికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాపం తెలిపారు.
ఏపీలో..
బాపట్ల జిల్లా (Bapatla District) చీరాల (Chirala) మండలం వాకవారిపాలెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు వీరబాబు. యథావిధిగా శనివారం పాఠశాలకు వచ్చాడు. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ కుప్పకూలిపోయాడు. సార్ ఒక్కసారిగా కుప్పకూలడంతో విద్యార్థులకు ఏం చేయాలో తెలియక కేక వేశారు. కూర్చున్న కుర్చీలోనే ప్రాణాలు వదలడంతో విద్యార్థులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఇతర ఉపాధ్యాయులు వచ్చి చూశారు. 108 అంబులెన్స్ తో పాటు గ్రామంలోని వైద్యుడికి సమాచారం ఇచ్చారు. ఆస్పత్రికి తరలించకముందే అతడు ప్రాణాలు కోల్పోయాడని తెలిసింది. అప్పటి దాకా పాఠాలు చెప్పిన సార్ లేడని విద్యార్థులతో పాటు తోటి ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో పాఠశాలలో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. వెంటనే పాఠశాలకు సెలవు ప్రకటించారు.