»Another Brs Minister Allola Indrakaran Reddy Wearing Brs Party Scarf With Voting
Allola indrakaran reddy: వివాదంలో మరో బీఆర్ఎస్ మంత్రి..ఈసీ చర్యలు?
తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(allola indrakaran reddy) ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు. ఏకంగా పార్టీ కండువా కప్పుకుని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. అయితే ఈ సంఘటనపై ఈసీ చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి.
Another BRS minister allola indrakaran reddy wearing brs party scarf with voting
తెలంగాణ ఎన్నికల(Telangana assembly Elections 2023) నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(allola indrakaran reddy) ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. మంత్రి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుని పోలింగ్ బూత్ కు వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎల్లపల్లి గ్రామంలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుని ఈ ఎన్నికలకు వెళ్లడంపట్ల ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. అధికార పార్టీలో ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇలా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడం పట్ల అనేక మంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రతిపక్ష పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ అంశంపై ఎన్నికల సంఘం కచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
#Nirmal#BRS candidate Allola Indrakaran Reddy going to the polling booth wearing a party scarf has become a topic of discussion in the wake of the assembly elections. He exercised his right to vote in Ellapally village. Going to the polls with a scarf has been criticized. pic.twitter.com/PlTpmFwg1A
అయితే అసలు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే క్రమంలో మంత్రికి కుండావా ఉంటే ఎందుకు లోపలికి అనుమతి ఇచ్చారని నెటిజన్లు(netizens) ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నేతలను అసలు సరిగ్గా చెక్ చేశారా అని అడుగుతున్నారు. సాధారణ ప్రజలను ఫోన్ కూడా వద్దని చెబుతున్న అధికారులు ఇలాంటి మంత్రుల విషయంలో ఎందుకు రూల్స్ పాటించడం లేదని అంటున్నారు. అయితే ఈ సంఘటనపై ఎన్నికల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. అయితే మంత్రి కండువా కప్పుకుని ఓటువేసిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పోటీ చేస్తున్నారు.