Niharika Re-Entry as a actress in dead pixels web series
Niharika:మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika) మళ్లీ యాక్టింగ్ చేశారు. చైతన్యతో పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. కొత్తగా వెబ్ సిరీస్‌లో నటించారు. వైవా హర్ష అండ్ టీమ్‌తో కలిసి ‘డెడ్ పిక్సెల్స్’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఇదీ న్యూ ఏజ్ కంటెంట్ గల వెబ్ సిరీస్ అని మేకర్స్ చెబుతున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఇదీ స్ట్రీమ్ అవనుంది. కొత్త కంటెంట్‌తో వస్తున్న సిరీస్ అని టీజర్ చూస్తే అర్థం అవుతుంది.
వెబ్ సిరీస్‌లో నిహారిక (Niharika) గేమర్ రోల్ ప్లే చేశారు. నలుగురు కుర్రాళ్లతో కలిసి కొత్త తరహా గేమ్ క్రియేట్ చేస్తారు. దాంతో పొందింది, పొగొట్టుకుంది ఏందీ అనే కాన్సెప్ట్‌తో వెబ్ సిరీస్ వస్తోంది. ‘గేమ్ అంటే పని లేనప్పుడు ఆడతారు అనుకున్నా.. పనులు మానుకుని ఆడతారా’ అనే డైలాగ్ టీజర్లో నిహారిక (Niharika) చెబుతారు. ఇందులో వైవా హర్ష, అక్షయ్, సాయి రోనక్, భావన సాగి, రాజీవ్ కనకాల, బిందు చంద్రమౌళి, జయశ్రీ రాచకొండ తదితరులు నటించారు. వెబ్ సిరీస్‌కు స్క్రీన్ ప్లే అక్షయ్ పొల్ల అందించారు. సిద్ధార్థ్ సదాశివుని సంగీతం ఇచ్చారు. బీబీసీ స్టూడియో ఇండియా, టమడ మీడియా సంయుక్తంగా సిరీస్ నిర్మించగా.. ఆదిత్య మండల డైరెక్ట్ చేశారు.
మెగా డాటర్ నిహారక (Niharika) నాగబాబు కూతురు. 2016లో ఒక మనసు మూవీలో సంధ్య రోల్ పోషించారు. 2018లో ఒరు నల్ల నాల్ పాధు సొల్రెన్ అనే తమిళ సినిమా చేశారు. తెలుగులో హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా చేశారు. 2019లో సూర్యకాంతం మూవీలో నటించారు. మెగాస్టార్ చిరంజీవి సైరా నర్సింహారెడ్డిలో భాగ్యం అనే రోల్ పోషించారు. అలాగే ఢీ జూనియర్లో హోస్ట్‌గా చేశారు. చైతన్యతో పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. వారిద్దరూ వీడిపోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. చిరంజీవి ఒప్పించినట్టు తెలిసింది. ఇంతలో వెబ్ సిరీస్‌లో నటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.