Job hub:ఉత్తరాంధ్ర జాబ్ హబ్‌గా మరాబోతుందని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ (CM Jagan) అన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. వెనకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు సీఎం జగన్ (CM Jagan) శంకుస్థాపన చేశారు. సవరపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
ఉత్తరాంధ్ర అంటే వలసలు గుర్తొచ్చేవి అని సీఎం జగన్ (CM Jagan) గుర్తుచేశారు. కానీ ఆ పరిస్థితి మారబోతుందని చెప్పారు. మూలపేటలో ఇటీవలే పోర్టుకు శంకుస్థాపన చేశామని వివరించారు. భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువు కాబోతుందని చెప్పారు. అదానీ డేటా సెంటర్ కూడా ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నామని.. దీంతో ఏపీ ముఖచిత్రం మారబోతుందని తెలిపారు.
ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేయడాన్ని కొందరు జీర్ణించుకోలేక పోతున్నారని వివరించారు. ఎన్నికలకు 4,5 నెలల ముందు కొబ్బరి కాయ కొట్టి.. మేమే శంకుస్థాపన చేశామని కొందరు గొప్పలు చెప్పుకుంటారని విమర్శించారు. సుప్రీంకోర్టు (supreme court), ఎన్జీటీలో (ngt) కేసులు వేసి అడ్డుపడ్డారని గుర్తుచేశారు. ఆటంకాలు దాటి.. ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేశామని తెలిపారు. మెడికల్ టూరిజం, ఐటీ, ఇండస్ట్రీస్‌కు కేంద్ర బిందువు భోగాపురం ఎయిర్ పోర్టు కాబోతుందని చెప్పారు.
2026లో కూడా తనే ఎయిర్ పోర్టు శంకుస్థాపన చేస్తానని జగన్ (CM Jagan) తెలిపారు. 30 నెలల్లో ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని జీఎంఆర్ తెలిపిందని గుర్తుచేశారు. ఏ380 డబుల్ డెక్కర్ ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తామని సీఎం జగన్ (CM Jagan) అన్నారు.
ఉత్తరాంధ్ర అంటే మన్య వీరుడు అల్లూరి సీతారామరాజు (alluri sitaramaraju) గుర్తుకొస్తారు. అందుకే జిల్లాకు అల్లూరి పేరు పెట్టుకున్నామని వివరించారు. అభివృద్ది కావాలనే 3 జిల్లాలను ఆరు చేశామని చెప్పారు. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశామని.. జూన్ నెలలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్లను జాతికి అంకితం చేస్తామని తెలిపారు. ఇచ్చాపురం, పలాసకు రక్షిత తాగునీరు ఇస్తాం.. సాలూరులో డ్రైవర్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం అని సీఎం జగన్ తెలిపారు. సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచి పాలన సాగుతోందని మరోసారి సీఎం జగన్ ప్రస్తావించారు.