Supreme Court:సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో (Supreme Court) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊరట కలిగింది. సిట్ ఏర్పాటుపై ఏపీ హైకోర్టు (High court) ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై దర్యాప్తు కోసం వైఎస్ జగన్ (ys jagan) సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. దీనిని టీడీపీ నేత వర్ల రామయ్య (varla ramaiah) హైకోర్టులో (High court) సవాల్ చేశారు. సిట్ (sit) ఏర్పాటుపై హైకోర్టు (High court) ధర్మాసనం స్టే విధించింది. దీంతో ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించగా హైకోర్టును (High court) ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది.
సిట్ (sit) ఏర్పాటుపై గత కొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలో గల ధర్మాసనం ఈ రోజు విచారించి.. తీర్పునిచ్చింది. గత ప్రభుత్వంలో జరిగిన నిర్ణయాలకు సంబంధించి సిట్ విచారణ ప్రాథమిక దశలో ఉందని.. ఈ క్రమంలో విచారణకు ఆటంకం కలిగించొద్దు అని స్పష్టంచేసింది. దర్యాప్తును యథాతథంగా కొనసాగించొచ్చు అని తేల్చిచెప్పింది. అమరావతిలో భూ కుంభకోణం, భారీ ప్రాజెక్టులపై అవినీతిపై సిట్‌ను జగన్ (jagan) సర్కార్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.