Huge Money Has Recovered Upon Mango Tree at Karnataka
Huge Money Recovered:కర్ణాటకలో మద్యం (liquor) ఏరులై పారుతోంది. ప్రలోభాల పర్వం జోరందుకుంది. ఇక డబ్బుల (money) గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అవును చెట్లు, పుట్టలపై నగదు పెడుతున్నారు. మైసూర్లో (mysore) ఓ వ్యక్తి ఇంట్లో చెట్టుపై భారీగా నగదును (money) అధికారులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.
పుత్తూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న అశోక్ కుమార్ రాయ్ (ashok) సోదరుడు సుబ్రహ్మణయ్య రాయ్ ఇంట్లో అధికారులు రైడ్ చేశారు. ఎన్నికల సమయంలో రైడ్స్ కామనే.. ఇంటి ఆవరణలో గల మామిడి చెట్టుపై (mango tree) చూసి ఆశ్చర్యపోయారు. అవును చెట్టుపై బాక్సులు కనిపించాయి. వాటిని తీసి.. తెరచి చూడగా నోట్ల కట్టలు కనిపించాయి.ఆ డబ్బును (money) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూర్ సిటీ (bengalure) మార్కెట్ ఏరియాలో ఈ నెల 13వ తేదీన రూ.కోటి నగదును (money) పోలీసులు సీజ్ చేశారు. ఆటోలో ఇద్దరు డబ్బు తీసుకెళ్తుండగా డబ్బు గురించి తెలిసింది. ఆ డబ్బు ఎక్కడిదని అడగగా లెక్క చూపలేదు. దీంతో పోలీసులు (police) స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటక అసెంబ్లీకి ఈ నెల 10వ తేదీన ఎన్నిక జరగనుంది. ప్రలోభాల పర్వం ఊపందుకోవడంతో ఐటీ అధికారులు (it officials) దాడులు చేస్తున్నారు. రైడ్స్ చేయగా కోట్ల నగదు (money) సీజ్ చేస్తున్నారు. శనివారం నాటికి రాష్ట్రంలో రూ.302 కోట్ల విలువగల లెక్కచూపని నగదు, వస్తువులను ఎన్నికల కమిషన్ సీజ్ చేసింది. ఇందులో బెంగళూరులో (bengalure) రూ.82 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.