అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రొ కబడ్డీ, ఫుట్ బాల్ 9వ సీజన్లు నేటి నుంచి ప్రారంభం అయ్యింది. ఈ సీజన్ లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. ప్రొ కబడ్డీ లీగ్ బెంగళూరు, పూణే,హైదరాబాద్ 3 వేదికల్లో ఈ టోర్నీ జరగనుంది. మరోవైపు 11 జట్లతో పోటీ పడుతున్నఇండియన్ సూపర్ లీగ్…మొదటి మ్యాచ్ కొచ్చిలో ప్రారంభం కానుంది. PKL, ISL రెండు మ్యాచులు రాత్రి ఏడున్నర నుంచి ప్రారంభం కానున్నాయి. అభిమానులు స్టా...
హీరో అక్కినేని నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ మూవీ తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లలో నిరాశ పరిచింది. అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రావడంతో వసూళ్లలో వెనకబడింది. దీంతో మొదటిరోజు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో సుమారు 11 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు వెల్లడించారు. తెలుగు, తమిళ ...
30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. వైసీపీకి ఇక మంగళం పాడేశానని వెల్లడించారు. అధికారం ఉన్నా లేకపోయినా పవన్ కల్యాణ్ మాత్రమే తమ నాయకుడు, సినిమా పెద్ద అని పేర్కొన్నారు. పవన్ పేదలకు అండగా ఉంటారని తెలిపారు. తనకు కరోనా వస్తే ఒక్కరూ కూడా పట్టించుకోలేదని పృధ్వీరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వైసీపీతో దరిద్రం పోయిందని విమర్శించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పృధ్వీర...
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 38 కోట్ల కలెక్షన్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో 22 కోట్ల గ్రాస్ వసూలైనట్లు తెలిసింది. దసరా పండుగ సందర్భంగా నిన్న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మోహన్ రాజా దర్శకత్వం ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, నయన...
దగ్గు మందు తాగి దాదాపు 66మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గాంబియా దేశంలో ఈ చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. అయితే…. ఆ దగ్గుమందు భారత్ లో తయారు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో రంగంలో దిగిన ప్రపంచ ఆరోగ్యసంస్థ విచారణకు ఆదేశించింది. మైడెన్ ఫార్మాసుటికల్ కంపెనీతో పాటు భారతదేశంలోని రెగ్యులేటరీ అథారిటీల పనితీరును విచారించనున్నారు. ఓరల్ సొల్యూషన్స్, కోఫెక్స్ మాలిన్ బే...
ప్రతి ఏటా దసరా వస్తే చాలు..రెండు వర్గాలు కర్రలతో ఒకరిపై ఒకరు తెగ కొట్టుకుంటారు. ఈ వేడుకకు పోలీసులు కూడా అనుమతి ఇవ్వడం విశేషం. అదేంటీ అనుకుంటున్నారా..అవును మీరు విన్నది నిజమే. ఏపీ కర్నూల్ జిల్లా దేవరగట్టులో ప్రతి సంవత్సరం దసరా రోజున బన్ని ఉత్సవం పేరుతో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. శ్రీమాళ మల్లేశ్వర స్వామి ఆలయం దగ్గర ఈ ఉత్సవం జరుపుతున్నారు. ఈ ఏడాది కూడా వారి సంప్రదాయం ప్రకారం నిర్వహించిన కర్రల సా...
ఏపీలోని శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌పై జాతీయ మహిళా కమిషన్(NCW) ఛైర్‌పర్సన్ రేఖా శర్మ సీరియస్ అయ్యారు. సీఐ దురుసు ప్రవర్తనతో ఆమెపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖాశర్మ లేఖ రాశారు. సీఐ చేతిలో గాయపడిన మహిళకు వైద్యం అందించాలని సూచించారు. మరోవైపు సీఐ అంజూ యాదవ్ తాను కావాలని దాడి చేయలేదని ఆడియో రిలీజ్ చేశారు...
ఓ రాజకీయ నేత ఉచితంగా మద్యం సీసా, కోళ్లను పంపిణీ చేస్తున్నారు. విషయం తెలిసిన స్థానికులు తీసుకునేందుకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. క్వార్టర్ మందు సీసా, కోడి కోసం కిలోమీటర్ల మేర లైన్లు కట్టారు. అదేంటీ అనుకుంటున్నారా. అవును మీరు విన్నది నిజమే. ఇది ఎక్కడో కాదు. తెలంగాణ వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. TRS నేత రాజనాల శ్రీహరి సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ఇలా చేస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు కేటీఆర్ న...
ఏపీలోని బాపట్ల సూర్యలంక బీచులో ఘోర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో స్నానం కోసం వెళ్లిన యువకుల్లో నీట మునిగి ముగ్గురు మృతి చెందగా..మరో నలుగురు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరిని గజ ఇతగాళ్లు రక్షించగా..మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ యువకులందరూ విజయవాడకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ కూడా చూడండి: ‘ఆదిపురుష్’ డైరెక్టర్‌కు ప...
తెలంగాణ ప్రభుత్వానికి గట్టి షాక్ ఎదురైంది. జాతీయా హరిత ట్రైబ్యునల్ (NGT) రాష్ట్రంపై ఏకంగా రూ.3,825 కోట్ల జరిమానాను విధించింది. ద్రవ, ఘన వ్యర్థాలను సరియైన క్రమంలో నిర్వహించనందుకు ఈ మేరకు ఫైన్ వేసింది. ఈ మొత్తం రెండు నెలల్లో ఆయా ఖాతాల్లో జమ చేయాలని సీఎస్‌ను ఆదేశించింది. ఈ క్రమంలో మురుగునీటి నిర్వహణ కోసం కొత్తగా శుద్ది ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. దీంతోపాటు ఉన్న వ్యవస్థలను ఆధునీకరించుక...
జమ్ముకశ్మీర్‌లో ఓ పోలీస్ ఉన్నతాధికారి దారుణ హత్యకు గురయ్యారు. జైళ్ల శాఖ డీజీ హేమంత్ లోహియాను సోమవారం రాత్రి గోంతుకోసి చంపేశారు. లోహియా ఇంట్లో పనిచేసే యాసిర్ అహ్మద్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అసోంకు చెందిన 57 ఏళ్ల హేమంత్ ఇటివలే పదోన్నతి పొంది ఆగస్టులో జైళ్ల డీజీగా నియమితులయ్యారు. ఘటనా స్థలంలో సేకరించిన సీసీటీవీ ఫుటేజీలో యాసిర్ నేరం చేసిన తర్వాత పారిపోతున్నట్ల...
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం(అక్టోబర్ 4న) భారీ లాభాలతో మొదలయ్యాయి. BSE సెన్సెక్స్ ఒకదశలో 1,191 పాయింట్లు పెరుగగా.. NSE నిఫ్టీ 345 పాయింట్లు వృద్ధి చెందింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు కూడా వరుసగా 979, 533 పాయింట్లు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనుకూల ధోరణులు కొనసాగుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సోమవారం ఆసియా, అమెరికా మార్కెట్లు పుంజుక...
మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. నవంబర్ 3న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో..నెల రోజుల్లో ఎలా ప్రచారం చేయాలనే దానిపై పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో మునుగోడులో గ్రామం నుంచి మండల స్థాయి నేతలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఎక్కువ ప్రజాదారణ ఉన్న నేతలకు లక్షల రూపాయలు సైతం ఇచ్చేందుకు పార్టీలు రెడీగా ఉన్నట్...
హైదరాబాద్ లో మీరు ప్రయాణించే క్రమంలో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద రెడ్ లైట్ వెలిగినా కూడా మీ వాహనాలు వైట్ లైన్లను దాటుతున్నాయా.. అయితే మీకు జరిమానా తప్పదు. ఎందుకంటే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్స్ తీసుకొచ్చారు. అంతేకాదు వైట్ లైన్ క్రాస్ చేసి ఎదురుగా వచ్చే వాహనాలకు అడ్డుగా ఉన్నా కూడా ఫైన్ విధించనున్నట్లు ట్రాఫిక్ అధికారులు పేర్కొన్నారు. రోడ్ అబ్ స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్ మెంట్ (రోప్...
తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇటీవల నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో ఉద్యోగార్థుల క్వాలిఫై మార్కులను తగ్గిస్తున్నట్లు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు స్పష్టం చేసింది. 200 ప్రిలిమ్స్ మార్కుల పరీక్షలో ఓసీ అభ్యర్థులకు 30 శాతం, బీసీలకు 25 శాతం, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనిక ఉద్యోగులకు 20 శాతం అర్హత మార్కులుగా కేటాయించారు. దీంతో ఓసీలకు 60, బీసీ...