Twitter Logo : ఎలాన్ మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఇప్పటికి అనేక మార్పులు చేశాడు. ఎలాన్ మస్క్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే..ఎప్పుడు సంచలన నిర్ణయాలతో వార్తల్లోకెక్కే ట్విట్టర్ అధినేత మూడురోజులనుండి వరుసగా వార్తల్లో నిలుస్తున్నాడు.
Posani Murali : నంది అవార్డ్స్ పై నటుడు పోసాని కృష్ణ మురళీ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఆయన చేసిన కామెంట్స్ పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవి నంది అవార్డులు కావని… కమ్మ, కాపు అవార్డులని , నంది అవార్డులను గ్రూపులు, కులాల వారీగా పంచుకున్నారని పోసాని ఆరోపించారు.
Telangana Govt : తెలంగాణలో వ్యాపారులకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ఇక నుంచి వ్యాపారులు తమ దుకాణాలను 24గంటలు తెరచి ఉంచుకోవచ్చు. 24/7 షాపులు ఓపెన్ చేసేందుకు అనుమతినిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ఏడాదికి రూ.10 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) బదిలీల పర్వం కొనసాగుతున్నది. ఐఏఎస్‌ను ట్రాన్స్ఫర్ చేసిన 24 గంటల్లోనే ఐపీఎస్‌లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. 12 జిల్లాలకు కొత్త ఎస్పీలను తీసుకొచ్చింది.శుక్రవారం 54 మంది ఐఏఎస్ (IAS) అధికారులను ట్రాన్స్ఫర్ చేసిన ప్రభుత్వం తాజాగా ఐపీఎస్‌లను (IPS) బదిలీ (Transfer) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సింగరేణి (Singareni) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ (BRS) ఆధ్వర్యంలో ఇవాళ మహాధర్నా జరగనుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR)పిలుపు మేరకు ప్రధాని మోదీ (PM Modi) కి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా మహాధర్నా చేపట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వంపై సింగరేణి కార్మికలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
తెలంగాణతో ఏపీలోని ప్రధాన నగరాలకు వెళ్లేందుకు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. గతంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి వందే భారత్ ప్రారంభించగా.. తాజాగా హైదరాబాద్ నుంచి తిరుపతికి మరో రైలు ప్రారంభమైంది.
ప్రముఖ హీరోయిన్ నయనతార (Nayanthara) అభిమానిపై చిందులేసిన వీడియో ఒకటి సోషల్ మీడియా(Social media)లో తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు వీడియో తీస్తుండడంతో ఆగ్రహంతో ఉగిపోయిన నయన్..వీడియో తీయడం తక్షణం ఆపకుంటే ఫోన్ పగలగొట్టేస్తానని హెచ్చరించారు.
తెలంగాణలో ఎస్ఐ పోస్టులకు తుది రాత పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) అన్ని ఏర్పాట్లు చేసింది .నేడు అర్థమెటిక్ (Arithmetic) అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ(Reasoning/Mental Ability) పేపర్ ఎగ్జామ్ ఫస్ట్ షిఫ్ట్ ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు, సెకండ్ షిఫ్ట్ 2.30 గంటల నుంచి 5.30 ఇంగ్లీష్ పేపర్ (English paper) ఉంటుంది. ఆదివారం ఫస్ట్ షిఫ్ట్ ఉద...
సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు ఐపీఎల్ -16లో వరుసగా రెండో పరాజయం చవిచూసింది.లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergiants) తో మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 (IPL-16) వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి నిరాశపరిచింది. లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
మరికొన్ని గంటల్లో రాష్ట్రానికి ప్రధాని మోడీ వస్తున్నారు. ఇంతలో హైదరాబాద్‌లో మరో భారీ ప్లెక్సీ వెలిసింది. మోడీ కుటుంబం స్వాగతం చెబుతోంది అని పైన రాసి ఉంది. అందులో రాజకీయ నేతలు తండ్రులు/ కుమారులు- కుమార్తెలు ఉన్నారు.
పేద ఖైదీల కోసం కేంద్ర హోమ్ శాఖ (Central Home Department) నూతన పథకాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.నేరాలు నిరూపించబడితన తరువాత కోర్టు విధించిన జరిమానాల (fines) ను కట్టలేని, బెయిల్ ఫీజు(Bail Fee)ను కట్టలేని పేద ఖైదీలకు కోసం పథకాన్ని తీసుకొస్తున్నామని వెల్లడించింది.
ఏపీలో రెండు వారాల్లో 15,096 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, 267 మంది కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు గుర్తించామని ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని (Health Minister Vidada Rajani) తెలిపారు. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం పట్ల కేంద్ర ప్రభుత్వం (Central Govt) రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని స్పష్టం చేసింది.
పదో తరగతి హిందీ పేపర్ లీక్ జరిగడానికి కారణమైన స్టూడెంట్ను డిబార్ చేశారు. ఐదేళ్లపాటు పరీక్ష రాసేందుకు వీలులేదని డీఈవో స్పష్టంచేశారు. దీంతో బాధితుడు మీడియా ముందుకు వచ్చాడు. తన తప్పు ఏం లేదని చెబుతున్నాడు.