27 రకాల సుగంధ ద్రవ్య పరిమళాలు వెదజల్లే పట్టుచీరను మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సాయినగర్‌కు చెందిన నల్ల విజయ్ ఈ చీరను రూపొందించారు. గతంలో అగ్గిపెట్టె, ఉంగరం, దబ్బనం వంటి వస్తువుల్లో పట్టే చీరను తయారు చేసిన విజయ్.. తాజాగా సువాసనలు వెదజల్లే చీరను నేసి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సందర్భంగా మంత్రులు విజయ్‌ని మెచ్చుకున్నారు. ఈ క్రమంలో విజయ్ విజ్ఞప్తి మ...
రోజురోజుకు యువతులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలోని కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతి తన ప్రేమను ఒప్పుకోలేదని..ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె చికిత్స పొందుతూ మరణించింది. కూరాడకు చెందిన యువతిని స్థానికంగా ఉండే సూర్యానారయణ లవ్ చేస్తున్నానని వెంటపడుతున్నాడు. అందుకు ఆమె నిరాకరించడంతో…కోపం పెంచుకున్న యువకుడు మార్గమధ్యలో ఆమె గొంతు...
మెగా పవర్ స్టార్ హీరో రామ్‌చరణ్ నటించిన ధృవ మూవీ సీక్వెల్ తీయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ మూవీ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని భావిస్తున్నట్లు సినీ వర్గాలు చెబతున్నాయి. ఇక 2016లో విడుదలైన ధృవ మూవీ ఘన విజయం సాధించి…అప్...
ఏడుపదుల వయసులోను సూపర్ స్టార్ రజినీకాంత్ తగ్గేదేలే అంటున్నారు. తాజాగా మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్లు పెరియా స్వామి, శిబి చక్రవర్తిలకు ఛాన్స్ ఇచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. లైకా ప్రొడక్షన్ ఆధ్వర్యంలో ఈ రెండు సినిమాలు చేయనున్నట్లు తెలిసింది. ఈ చిత్రాల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ మూవీలో నటిస్తున్నారు....
మహారాష్ట్రలోని నాసిక్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు తెల్లవారుజామున ఘోర ప్రమాదానికి గురైంది. డీజిల్ రవాణా చేస్తున్న ట్రక్కును బస్సు ఢీకొనడంతో బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 14 మంది సజీవ దహనం కాగా, మరో 24 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బస్సు యవాత్‌మల్ నుంచి ముంబై వెళ్తుండగా…ట్రక్కు నాసిక్ నుంచి పూణే వస్తుంది. ఆ క్రమం...
సీఎం కేసీఆర్ కొత్త పార్టీ పెట్టడంపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కాదు కదా…ఆయన తాత వచ్చినా తమకు ఏ నష్టం ఉండదని వెల్లడించారు. సీఎం జగన్ సింహం లాంటి వారని…అందరూ కలిసి వచ్చినా ఇబ్బంది లేదన్నారు. అయినా కూడా తామే అత్యధిక మెజారిటీతో గెలుస్తామని చెప్పారు. అసలు మా పార్టీకి వ్యతిరేక ఓట్లే లేవని మంత్రి కారుమూరి అన్నారు. పవన్ కల్యాణ్ చెబుతున్నట్లు తమ ఓట్లు చీలే అవకాశమే ...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్ల అప్పులున్నాయో చెప్పాలని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు ఎటు పోతున్నాయని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలతో సామాన్యుల జీవితాలు చిధ్రం అవుతున్నాయని విమర్శించారు. గుంతల రోడ్డు కారణంగా చిన్నారి మృతి, ఆస్పత్రిలో ఓ వ్యక్తికి బిల్లు, పె...
మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు గుప్పించారు. మోదీ మన్ కీ బాత్ చెబుతారని..కానీ ఆయన మాత్రం వినరని ఎద్దేవా చేశారు. గుజరాత్ మోడల్ చూపించి 8 ఏళ్లలో దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఇండియా నైజీరియా కంటే దారుణంగా తయారువుతుందని ఆరోపించారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు ఇస్తామన్న మోదీ హామీ ఏమైందని నిలదీశారు. సాగు దండగ కాదని..పండుగ అని సీఎం కేసీఆర్ నిరూపించారని కేటీఆర్ కొనియాడారు. ఫ్లోరైడ్ సమ...
ఓలా, ఉబర్, ర్యాపిడో కంపెనీలకు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది. రాబోయే 3 రోజుల్లో ఆటో సర్వీసులను నిలిపివేయాలని ఆదేశించింది. అధిక ధరలు వసూలు చేస్తున్నారంటూ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తొలి 2 కిలోమీటర్లకు 30 రూపాయలు వసూలు చేయాలి. ఆపై ప్రతి 2 కిలోమీటర్‌కు 15 రూపాయల చొప్పున తీసుకోవాలి. కానీ ఈ యాప్‌ల్లో తొలి 2 కిలోమీటర్లకే 100 ...
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇకపై రాత్రి 11 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 10 నుంచి ఈ సేవలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం మెట్రో సేవలు రాత్రి 10.15 గంటల వరకు కొనసాగుతుండగా..వీటిని 11 గంటల వరకు పొడిగించారు. ఈ నిర్ణయం పట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొత్తగా హైదరాబాద్ మెట్రోలో జర్నే చేసేందుకు వా...
తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్…భారీగా రుణం తీసుకుని చెల్లించడం లేదని బ్యాంకులు చెబుతున్నాయి. 2014 నుంచి 2022 వరకు 33,787.26 కోట్ల రూపాయల రుణం చెల్లించాలని బ్యాంకులు వెల్లడించాయి. ధాన్యం కొనుగోళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వ గ్యారంటీతో ఈ కార్పొరేషన్ అప్పులు తీసుకుని చెల్లించడం లేదని తెలిపాయి. ప్రతి ఏటా కోట్ల రూపాయలు అప్పులుగా తీసుకుని ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పాయి. మరోవైపు పీ...
తెలంగాణలో మళ్లీ ఎన్నికల జోరు మొదలైంది. ఈరోజు నుంచి మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 14 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా…అక్టోబర్ 17న నామినేషన్ల ఉపసంహరణ చేయనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రిటర్నింగ్ అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథ రావును నియమించారు. నామినేషన్ల ప్రక్రియ విధానాన్ని వీడియో రికార్డు చేయనున్నారు. ఈ క్రమం...
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రొ కబడ్డీ, ఫుట్ బాల్ 9వ సీజన్లు నేటి నుంచి ప్రారంభం అయ్యింది. ఈ సీజన్ లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. ప్రొ కబడ్డీ లీగ్ బెంగళూరు, పూణే,హైదరాబాద్ 3 వేదికల్లో ఈ టోర్నీ జరగనుంది. మరోవైపు 11 జట్లతో పోటీ పడుతున్నఇండియన్ సూపర్ లీగ్…మొదటి మ్యాచ్ కొచ్చిలో ప్రారంభం కానుంది. PKL, ISL రెండు మ్యాచులు రాత్రి ఏడున్నర నుంచి ప్రారంభం కానున్నాయి. అభిమానులు స్టా...
హీరో అక్కినేని నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ మూవీ తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లలో నిరాశ పరిచింది. అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రావడంతో వసూళ్లలో వెనకబడింది. దీంతో మొదటిరోజు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో సుమారు 11 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు వెల్లడించారు. తెలుగు, తమిళ ...
30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. వైసీపీకి ఇక మంగళం పాడేశానని వెల్లడించారు. అధికారం ఉన్నా లేకపోయినా పవన్ కల్యాణ్ మాత్రమే తమ నాయకుడు, సినిమా పెద్ద అని పేర్కొన్నారు. పవన్ పేదలకు అండగా ఉంటారని తెలిపారు. తనకు కరోనా వస్తే ఒక్కరూ కూడా పట్టించుకోలేదని పృధ్వీరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వైసీపీతో దరిద్రం పోయిందని విమర్శించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పృధ్వీర...