హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం యాక్ట్ చేసిన తాజా చిత్రం మీటర్(Meter) నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
సినిమా: మీటర్ నటీనటులు: కిరణ్ అబ్బవరం, అతుల్య రవి, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి దర్శకుడు: రమేష్ కడూరి నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు సంగీత దర్శకుడు: సాయి కార్తీక్ సినిమాటోగ్రఫీ: వెంకట్ సి దిలీప్ ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్ ఆర్ విడుదల తేదీ: ఏప్రిల్ 7, 2023
ఇటీవల వినరో భాగ్యము విష్ణు కథ మూవీతో హిట్టు కొట్టిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా మీటర్ చిత్రంతో సినీ ప్రేమికులను అలరించేందుకు ఈరోజు(ఏప్రిల్ 7న) ముందుకొచ్చాడు. రమేష్ కడూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అసలు మూవీ ప్రియులను ఆకట్టుకుందా లేదా అనేది ఇక్కడ చుద్దాం.
కథ
అర్జున్ కళ్యాణ్ అలియాస్ కిరణ్ అబ్బవరంకి పోలీస్ ఆఫీసర్ అవ్వటం ఇష్టం లేదు. తన తండ్రి, నిజాయితీ గల అధికారి పదే పదే అవమానించడం చూసి పోలీసులను అసహ్యించుకుంటాడు. తనని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చూడాలని కలలు కంటున్న తన తండ్రికి అతను ఈ విషయాన్ని ఎప్పుడూ పంచుకోడు. కానీ పోలీస్ ఆఫీసర్ అవుతాడు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పోస్టింగ్ పొందుతాడు. అతను తన స్నేహితుడు (సప్తగిరి) నుంచి ఆలోచనలతో ఉద్యోగం నుంచి తనను తాను తొలగించుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు. కానీ మంచి పేరు తెచ్చుకుంటాడు. అనూహ్యంగా, అతను హోం మంత్రి కాంతం బైరెడ్డి (ధనుష్ పవన్)ని అడ్డగిస్తున్నాడు. తర్వాత అర్జున్‌కి ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది. నిజం ఏమిటి? అర్జున్ తర్వాత ఏం చేశాడు? ఆ తర్వాత కిరణ్ అబ్బవరం పోలీస్ జాబ్ మానేశాడా? మంత్రితో గొడవ ఏమైంది అనేదే ఈ మీటర్ కథ.
విశ్లేషణ
మీటర్ అనే ఒక మాస్ టైటిల్ కాబట్టి సినిమాకి తిరుగులేదని అనుకున్నారు. కానీ అందరి అంచనాలని తలకిందులు చేస్తూ మీటర్ మూర అయ్యింది. కమర్షియల్ సినిమా విజయానికి ఆయువుపట్టుగా నిలిచే కథ, కామెడీ, హీరోయిజం, విలనిజం, హాస్యం, పాటలు ఇలా అన్నింటిలో మీటర్ ముస్తాబుకి నోచుకోలేదు. అసలు దర్శకుడు రమేష్ కడూరి ఎంచుకున్న కథ ఇప్పటి వరకు వచ్చిన అనేక తెలుగు సినిమాల కాపీ సరుకు. ఇలాంటి కథకి హీరో ఎంత కష్ట పడిన స్క్రీన్ మీద హీరోని చూస్తున్న ఆడియన్స్ కి మాత్రం ఎక్కడో ఇలాంటి క్యారక్టర్ ని చూశాం కదా అని అనిపిస్తునే ఉంటుంది. కిరణ్ అబ్బవరంని మాస్ హీరోగా నిలబెట్టాలని రమేష్ కడూరి ప్రయత్నించాడు కానీ కానీ తన దర్శకత్వంతో పూర్తిగా విఫలమయ్యాడని చెప్పవచ్చు. మీటర్ మెజర్ ఆఫ్ ప్యాషన్ అనే ట్యాగ్‌లైన్‌తో సినిమా నడుస్తుంది. చివరిగా కిరణ్ అబ్బవరం మాస్ ఇమేజ్ కోసం తహతహలాడి చేతులు కాల్చుకున్నాడనిపిస్తుంది.
ఎవరెలా చేశారు
కథ బాగోకపోతే తాను ఎంత కష్టపడినా వేస్ట్ అనే విషయం ఈ మూవీతో ఐనా కిరణ్ అబ్బవరం తెలుసుకుంటే బాగుంటుంది. అయితే తన క్యారెక్టర్ మేరకు హీరో బాగానే యాక్ట్ చేశాడు. మినిస్టర్ పాత్రలో విలన్ గా చేసిన ధనుష్ పవన్ తన క్యారక్టటెర్ కి న్యాయం చేయనట్టుగానే అనిపించింది. ఇంకా డైరెక్టర్ రమేష్ కధూరి విషియానికి వస్తే తన మొదటి సినిమా కి ఇలాంటి రొటీన్ కథని ఎంచుకుని తప్పు చేశాడు. మిగతా పాత్రల్లో కమెడియన్ సప్తగిరి తన రొటీన్ కామెడీనే ప్రదర్చించాడు. చాల రోజుల తర్వాత పోసాని కృష్ణ మురళి వెండి తేర మీద మెరిశాడు. కొత్తగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అతుల్య రవి సహ తదితరుల యాక్టింగ్ పర్వాలేదనిపిస్తుంది.