యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో బడా బడా సంస్థలు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాయి. కానీ విజయాలు మాత్రం వరించడం లేదు. అందుకే.. సడెన్‌గా షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇంతకీ కిరణ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటీ?
రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా ఇంట్రీ ఇచ్చిన కిరణ్.. ఆ తర్వాత వెంటనే ఎస్ఆర్ కళ్యాణ మండపంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. కానీ ఆ తర్వాతే రేసులో వెనకపబడిపోయాడు. సెబాస్టియన్, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని.. సినిమాలతో ఆకట్టుకోలేకపోయాడు. కానీ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో తెరకెక్కిన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాతో పర్వాలేదనిపించాడు. అయితే ఇటీవల వచ్చిన రూల్స్ రంజన్ సినిమాతో మరోసారి బోల్తా కొట్టాడు కిరణ్. దీంతో ఈ యంగ్ హీరో బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేస్తున్నాడు తప్పితే.. హిట్ మాత్రం అందుకోవడం లేదు.
ఇలాగే.. మరో రెండు ఫ్లాప్స్ పడితే కిరణ్ కెరీర్ క్లోజ్ అని అంటున్నారు. ఇప్పటికైనా కథల విషయంలో కిరణ్ అబ్బవరం జాగ్రత్త పడితే బెటర్. అందుకే.. తాజాగా తాను సినిమాలకు ఆరు నెలలు బ్రేక్ ఇస్తున్నట్టుగా చెప్పాడు కిరణ్. వరుస ఫెయిల్యూర్స్ గురించి కిరణ్ అబ్బవరం కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ సినిమాల కోసం రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని.. లాభాల్లో వాటా పద్దతిలోనే సినిమాలు చేస్తున్నట్లుగా తెలిపాడు. ఒకవేళ ప్రొడ్యూసర్లు నష్టపోతే.. వారిని ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ అడగనని అన్నాడు. అలాగే.. ‘మీటర్’, ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ సినిమాల రిజల్ట్‌ను తాను ముందే ఊహించినట్లు చెప్పాడు.
గత సినిమాల ఫలితాల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను.. అందుకే ఇకపై కథలు, ఎగ్జిక్యూషన్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను.. తొందరపడి సినిమాలు చేయడం కాకుండా.. మంచి కథలను ఎంచుకోవాలని.. అందు కోసం ఆరు నెలల పాటు బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలిపాడు కిరణ్ అబ్బవరం. మరి బ్రేక్ తర్వాత కిరణ్ ఎలా బౌన్స్ బ్యాక్ అవుతాడో చూడాలి.