Kiran Abbavaram: ఫస్ట్ హీరోయిన్‌తో కిరణ్ అబ్బవరం పెళ్లి?
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి అందరికీ తెలిసిందే. ఎంత స్పీడ్‌గా అయితే సినిమాలు చేసే.. అదే స్పీడ్‌లో వరుస పరాజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం బ్రేక్‌లో ఉన్న కిరణ్.. తన ఫస్ట్ హీరోయిన్‌తో పెళ్లికి రెడీ అవుతున్నాడు.
Kiran Abbavaram's marriage with the first heroine?
Kiran Abbavaram: రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా ఇంట్రీ ఇచ్చిన కిరణ్.. ఆ తర్వాత వెంటనే ఎస్ఆర్ కళ్యాణ మండపంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. కానీ ఆ తర్వాతే రేసులో వెనకపబడిపోయాడు. సెబాస్టియన్, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని.. సినిమాలతో ఆకట్టుకోలేకపోయాడు. కానీ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో తెరకెక్కిన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాతో ఓ పర్వాలేదనిపించాడు. అయితే ఆ తర్వాత వచ్చిన మీటర్, రూల్స్ రంజన్ సినిమాలు డిసప్పాయింట్ చేశాయి. దీంతో.. ఇక కిరణ్ కెరీర్ క్లోజ్ అయినట్టే.. అనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పటికైనా కథల విషయంలో కిరణ్ అబ్బవరం జాగ్రత్త పడితే బెటర్ అన్నారు. అందుకే.. సినిమాలకు ఆరు నెలలు బ్రేక్ ఇస్తున్నట్టుగా చెప్పాడు కిరణ్. ఇకపై కథలు, ఎగ్జిక్యూషన్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పాడు. ఇంకా కిరణ్ కొత్త ప్రాజెక్ట్స్ ఏవి అనౌన్స్ చేయలేదు.
కానీ ఈలోపు పెళ్లికి రెడీ అవుతున్నాడనే న్యూస్ వైరల్‌గా మారింది. తన తొలి సినిమా రాజావారు రాణీగారులో హీరోయిన్గా నటించిన రహస్య గోరఖ్‌తో కిరణ్ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నాడని.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అంతేకాదు.. మార్చి 13న, అంటే బుధవారం నాడు ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాడట. తర్వలోనే పెళ్లి డేట్ కూడా ప్రకటించనున్నట్టుగా సమాచారం.