»Rakul Preet Singh Shocking Decision Thats The First Thing After Marriage
Rakul Preet Singh: రకుల్ షాకింగ్ డెసిషన్.. పెళ్లి తర్వాత ఫస్ట్ చేసేది అదేనట?
మరో వారం రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతోంది హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. కొంత కాలంగా జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న రకుల్.. అతనితోనే మూడు ముళ్లు వేయించుకోబోతోంది. అయితే పెళ్లి తర్వాత రకుల్ చేయబోయే ఫస్ట్ పని కోసం ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
Rakul Preet Singh shocking decision.. That's the first thing after marriage?
Rakul Preet Singh: ఎట్టకేలకు కోరుకున్న వాడితోనే ఏడడుగులు వేయడానికి రెడీ అవుతోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. హీరో కమ్ ప్రొడ్యూసర్ అయినటువంటి జాకీ భగ్నానీతో ఫిబ్రవరీ 21న గోవాలో రకుల్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. రకుల్ పెళ్లికి సంబంధించిన మరో న్యూస్ కూడా వైరల్‌గా మారింది. తమ పెళ్లి ఎలా జరగాలనే విషయంలో ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట రకుల్, జాకీ. చాలా తక్కువమంది సన్నిహితుల, బంధువుల సమక్షంలో రకుల్, జాకీ పెళ్లి చేసుకోనున్నారు. గోవాలో జరగనున్నఈ పెళ్లి పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా జరగనుందని సమాచారం. అందుకే ఎవ్వరికీ వెడ్డింగ్ కార్డ్‌ను నేరుగా పంపలేదట. కేవలం వర్చువల్‌గానే ఇన్విటేషన్ పంపిచినట్టుగా తెలుస్తోంది. అలాగే.. పెళ్లి వేడుకలో కూడా ఎక్కడా టపాసులు కాల్చకూడదని ఫిక్స్ అయ్యారట ఈ కొత్త జంట. తమ పెళ్లి వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగకూడదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట.
అంతేకదు.. పెళ్లి వేడుక వల్ల ఎంత కార్బన్ డయాక్సైడ్ గాలిలో కలిసిందో కొలిచి మరీ.. దానికి తగినట్టుగా మొక్కలు నాటాలని ఫిక్స్ అయ్యారట. దీంతో రకుల్, జాకీలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పెళ్లి తర్వాత రోజే స్వయంగా రకుల్, జాకీ కలిసి ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతారని సమాచారం. కాబట్టి.. పెళ్లి తర్వాత రకుల్ చేయబోయే ఫస్ట్ పని మొక్కలు నాటడమే అన్నమాట. ఏదేమైనా.. రకుల్ మాత్ర తన పెళ్లి వల్ల ఎవ్వరికి నష్టం జరగకుండా చూడడం గ్రేట్ అని అంటున్నారు.