లేట్ అయిన పర్లేదు కానీ.. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అనేలా.. పుష్ప సీక్వెల్‌ను భారీగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇక బన్నీ ఈ సినిమా కోసం ఎంత కష్టపడాలో అంతకుమించి అనేలా రిస్క్ చేస్తున్నాడు. ప్రస్తుతం చీరకట్టుకొని డ్యాన్స్ చేయడానికి తెగ కష్టపడుతున్నాడట.
Allu Arjun: పుష్ప2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమాలో.. బన్నీ అమ్మవారు గెటప్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. ప్రజెంట్ అందుకు సంబంధించిన సీన్స్ షూట్ చేస్తున్నారు. అందుకోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ గంగమ్మ జాతర సెటప్ వేశారు. ఇక్కడ కొన్ని కీలక సన్నివేశాలతో పాటు.. వివిధ ప్రాంతాల నుంచి జాతర వేషాలతో ఓ పవర్ ఫుల్ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్‌కు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేస్తున్నాడు. అయితే.. ఎలాంటి స్టెప్ అయిన సరే ఈజీగా వేసే బన్నీ.. అమ్మవారి గెటప్‌లో చీర కట్టుకొని డ్యాన్స్ చేయడానికి చాలా కష్ట పడుతున్నాడట. ఈ సాంగ్ షూటింగ్లో బన్నీకి బ్యాక్ పెయిన్ కూడా వచ్చిందట. దీంతో ప్రస్తుతం షూటింగ్‌కు స్మాల్ బ్రేక్ ఇచ్చారట.
మళ్లీ 23 లేదా 24 నుండి షూటింగ్ ఉండొచ్చని తెలుస్తోంది. ఈ లెక్కన పుష్పరాజ్ ఎంతలా కష్టపడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. కచ్చితంగా బన్నీ ఈ మూవీతో పాన్ ఇండియా మార్కెట్లో మరో మెట్టు ఎక్కడం గ్యారెంటీ. అందుకు తగ్గట్టే.. పుష్ప2 పై చిత్ర యూనిట్ ఇస్తున్న హైప్ మామూలుగా లేదు. రీసెంట్గా మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ కొన్ని కీలక విషయాలు లీక్ చేశాడు. గంగమ్మ జాతర.. అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ సినిమాకే హైలెట్‌గా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ మరింత హైప్ ఇస్తోంది. ఇకపోతే.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నాడు. మరి పుష్ప2 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.