»Dunky Drop 2 Coming In Competition With Salaar Trailer
”Salaar’ ట్రైలర్‌కు పోటీగా..’డంకీ’ డ్రాప్2?
ఇప్పటి వరకు వచ్చిన మాస్ సినిమాలు వేరు.. ఈ సినిమా వేరు అనేలా రాబోతోంది సలార్. షారుఖ్ ఖాన్ నటిస్తున్న డంకీ సినిమా సలార్‌కు పోటీగా బరిలోకి దిగుతోంది. ట్రైలర్ విషయంలోను సై అంటోంది డంకీ.
'Dunky' drop 2 coming in competition with 'Salaar' trailer?
‘Salaar: బాహుబలి తర్వాత ప్రభాస్ కటౌట్‌కి తగ్గ పర్ఫెక్ట్ ఊరమాస్ సినిమా కావడంతో.. సలార్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్‌గా సలార్ రిలీజ్ కానుంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసిన ప్రశాంత్ నీల్.. ప్రజెంట్ సలార్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ కట్ చేసే పనిలో ఉన్నాడు. డిసెంబర్ 1 రాత్రి 7 గంటల 19 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ బయటికి రావడమే లేట్.. డిజిటల్ రికార్డ్స్ అన్నీ బద్దలు కానున్నాయి. అప్పటి నుంచే ప్రమోషన్స్ స్పీడప్ చేయనున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే.. డిసెంబర్ 22న సలార్ వర్సెస్ డంకీ వార్ మామూలుగా ఉండేలా కనిపించడం లేదు.
పఠాన్, జవాన్ సినిమాల జోష్‌లో షారుఖ్ ఖాన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘డంకీ’ పై ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. పైగా రాజ్ కుమార్ హిరాణీ డైరెక్టర్ అవడంతో.. ప్రభాస్, షారుక్ ఖాన్ మధ్య ఇండియాస్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ జరగబోతోంది. అందుకే.. ప్రతి విషయంలోనూ సలార్, డంకీ పోటీ పడుతున్నాయి. ఇప్పటికే సలార్ ట్రైలర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవగా.. అంతకంటే ముందే డంకీ నుంచి డ్రాప్ 2 రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇటీవల డంకీ డ్రాప్ వన్ పేరుతో గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు డ్రాప్ 2ని నవంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే, రేపే డంకీ నుంచి డ్రాప్ 2 బయటికి రానుంది. డ్రాప్ 1కు ఊహించిన రేంజ్లో రెస్పాన్స్ రాలేదు. అది చూసిన తర్వాత.. ఈ సినిమా సలార్‌తో పోటీ పడుతుందా? అనే కామెంట్స్ వినిపించాయి. అందుకే.. సలార్ ట్రైలర్ కంటే ముందే డంకీ డ్రాప్ 2 రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.