మాస్ మహారాజ రవితేజ, సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన క్రైం థ్రిల్లర్ మూవీ ‘రావణాసుర’ నేడు(ఏప్రిల్ 7న) థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా ఈ చిత్రం స్టోరీ, నటీనటుల యాక్టింగ్ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ స్టార్ హీరో, మాస్ మహారాజా రవితేజ యాక్ట్ చేసిన తాజా చిత్రం రావణాసుర నేడు(ఏప్రిల్ 7న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. స్వామి రారా, దోచేయ్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సహా టైటిల్ కూడా ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది. ఈ క్రమంలో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ఫుల్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న రవితేజ…రావణాసురతో హిట్టు కొట్టాడా లేదా? అసలు ఈ మూవీ స్టోరీ ఏంటనే విషయాలు ఇప్పుడు చుద్దాం.
కథ
రవీంద్ర (రవితేజ) ప్రముఖ క్రిమినల్ లాయర్ (ఫరియా అబ్దుల్లా) కనక మహాలక్ష్మి ఆధ్వర్యంలో పనిచేస్తున్న జూనియర్ లాయర్. ఒక రోజు హారిక (మేఘా ఆకాష్) కనక మహాలక్ష్మిని సంప్రదించి, ఆమె (హారిక) తండ్రి (సంపత్ రాజ్) హత్య కేసును టేకప్ చేయమని ఆమెని అడుగుతుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న రవీంద్ర హారికకు దగ్గరవుతాడు. ఆ క్రమంలో వివిధ రకాల వేషధారణల్లో రవీంద్ర అనేక హత్యలు చేస్తాడు. తర్వాత మేఘా ఆకాష్ ను కూడా హతమారుస్తాడు. అయితే ఆ హత్యలను గుర్తించిన పోలీసు శాఖ ఓ స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తుంది. ఈ నేరాలన్నీ ఎవరు చేస్తున్నారు? హారిక తండ్రికి ఈ నేరాలతో ఎలా సంబంధం ఉంది? హంతకుడి ఉద్దేశం ఏమిటి? బాధితులు ఒకరికొకరు ఎలా సంబంధం కలిగి ఉన్నారు? ఆ పోలీస్ ఆఫీసర్ హత్యలను చేధించాడా? అసలు రవీంద్ర హత్యలు ఎందుకు చేస్తున్నాడనేది అసలు స్టోరీ.
విశ్లేషణ
రావణాసుర మూవీలో ఫస్ట్ హాఫ్ మొత్తం దాదాపు ఆసక్తికరంగా కొనసాగుతుంది. మాస్ మహారాజా, ఫరియా అబ్దుల్లా, హైపర్ ఆది మధ్య సీన్స్ ఆకట్టుకుంటాయి. దీంతోపాటు మేఘా ఆకాష్ తో సాగే కొన్ని సన్నివేశాలు సరదాగా అనిపిస్తాయి. జయరామ్ పాత్ర ప్రాముఖ్యత, ఓ డైలాగ్స్ బాగుటుంది. అను ఇమ్మాన్యుయేల్ కు ఇంకా కొన్ని సీన్స్ ఇచ్చి ఉంటే బాగుండనిపిస్తుంది. మరోవైపు సుశాంత్ పాత్రను సస్పెన్స్‌గా పరిచయం చేశారు. శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ బాగున్నాయి. వాడు క్రిమినల్ లాయర్ కాదు.. లా చదివిన క్రిమినల్ ఈ డైలాగ్ చూట్టూనే స్టోరీ నడుస్తుంది. కానీ మర్డర్ సీన్స్ ఎక్కువైనట్లు అనిపిస్తాయి. ఇక సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కానీ అనేక ట్విస్టులు ఉండటం, వాటిలో కొత్తదనం లేకపోవడం సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు.
ఎవరెలా చేశారు
రవితేజ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో బాగా ఆకట్టుకున్నాడు. అతని బాడీ లాంగ్వేజ్, ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ పాత్రకు సరిగ్గా సరిపోయాయి. తన విలక్షణమైన బాడీ లాంగ్వేజ్‌తో కొన్ని సన్నివేశాలకు వంద శాతం న్యాయం చేశాడు. మరోవైపు సుశాంత్ ఈ మూవీలో కీలక పాత్రలో బాగానే యాక్ట్ చేశాడు. హైపర్ ఆది, జయకుమార్, సంపత్ వంటి నటులు కూడా వారి పాత్రలకు సరిగ్గా సరిపోయారు. అనూ ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, దక్ష నాగర్కార్, పూజిత పొన్నాడలు పర్వాలేదు. వారి క్యారెక్టర్ల పరిధి మేరకు నటించారు. దీంతోపాటు మరికొంత మంది కూడా వారి క్యారెక్టర్ల మేరకు న్యాయం చేశారని చెప్పవచ్చు.
సాంకేతికత
స్వామి రారా, రణరంగం ఫేమ్ సుధీర్ వర్మ ఈ చిత్రంలో ఓ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని ఎంచుకుని ఎన్నింటిని బ్యాలెన్స్ చేయలేదని చెప్పవచ్చు. ఇందులో కామెడీ, రొమాన్స్ ఇతర అంశాలను క్రైమ్ సీన్స్ డామినేట్ చేశాయని చెప్పవచ్చు. మరోవైపు కామెడీ, కథనంలో కూడా కొత్తదనం లేకపోవడం నిరాశ పరుస్తుంది. ఇంకొన్ని సీన్స్ అయితే లాజిక్ లేకుండానే ఉంటాయి. హర్షవర్ధన్ రామేశ్వరం, భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం పర్వాలేదు. వారిద్దరూ తమ పనితనంతో న్యాయం చేశారు. రామేశ్వరన్ హర్షవర్ధన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని భాగాల్లో బాగనే వర్క్ అవుట్ అయింది. శ్రీకాంత్ విస్సా అందించిన డైలాగ్స్ పర్వాలేదు. విజయ్ కార్తీక్ కన్నన్ చేసిన DOP స్టైలిష్‌గా ఉంది. అతని ఫ్రేమ్‌లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ విషయంలో కూడా అలాగే ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
రవితేజ యాక్టింగ్
కొన్ని డైలాగ్స్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
స్టోరీ కొత్తగా లేకపోవడం
హీరోయిన్స్ కు స్కోప్ తక్కువ
డామినేట్ చేసిన క్రైమ్ సీన్స్
ట్విస్టులు అంచనా వేయడం