Eye and Tooth చికిత్స కోసం ఢిల్లీకి కేసీఆర్.. మరీ జనం సంగతేంటీ: వైఎస్ షర్మిల
సీఎం కేసీఆర్పై వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ చేశామని చెబుతూ.. కంటికి, పంటి చికిత్స కోసం ఎందుకు ఢిల్లీ వెళుతున్నారని అడిగారు.
YS Sharmila:సీఎం కేసీఆర్ (cm kcr) వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల (YS Sharmila) మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ చేశామని చెబుతూ.. కంటికి, పంటి చికిత్స కోసం ఎందుకు ఢిల్లీ (delhi) వెళుతున్నారని అడిగారు. ఆరోగ్య తెలంగాణ అంటే ఒక్కో బెడ్డు మీద ఇద్దరు, ముగ్గురిని పడేయడమా? అని మండిపడ్డారు. రాష్ట్రంలో లక్ష మందికి (lakh people) ఓ డాక్టర్ (doctor), 10 వేల మందికి ఒక నర్సు ఉండటమా? ఆరోగ్య తెలంగాణ అంటే అని షర్మిల ప్రశ్నించారు.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లతో బాలింతలను పొట్టన పెట్టుకోవడమా? అని నిలదీశారు. JHS, EHS స్కీము పాతరేయడమా? 104 పథకాన్ని మూసేయడమా? అంటూ మండిపడ్డారు. పేదోడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్యశ్రీకి నిధులు ఎగ్గొట్టడమా? అని ధ్వజమెత్తారు. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లేదు. రాజధానిలో నలుదిక్కులా హెల్త్ హబ్బులు లేవు. ఉస్మానియా హెల్త్ టవర్ లేదని షర్మిల (Sharmila) గుర్తుచేశారు.
ఎలుకలు కొరికి రోగులు చనిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడు. పరికరాలు, యంత్రాలు పనిచేయకపోయినా దిక్కు లేదు… మారుమూల గ్రామాలకు అంబులెన్సులు లేవని షర్మిల (Sharmila) మండిపడ్డారు. దవాఖాన్లలో సిబ్బంది లేరు. ఆసుపత్రి భవనాలు పాత బడి, పెచ్చులూడుతున్నా సోయి లేదన్నారు. ఆరోగ్య తెలంగాణ పేరుతో అనారోగ్య తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. జబ్బు చేస్తే అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకునేలా చేస్తున్నారని షర్మిల (Sharmila) ఆగ్రహాం వ్యక్తం చేశారు.
ఆరోగ్య తెలంగాణ చేశామంటున్న దొరగారు కంటికి, పంటికి హస్తినకు ఎందుకు పోతున్నట్టు? ఆరోగ్య తెలంగాణ అంటే ఒక్కో బెడ్డు మీద ఇద్దరు,ముగ్గురిని పడేయడమా? లక్షమందికి ఒక డాక్టర్, 10వేల మందికి ఒక నర్సు ఉండటమా? కుని ఆపరేషన్లతో బాలింతలను పొట్టన పెట్టుకోవడమా? JHS, EHS స్కీములను పాతరేయడమా? 1/3