Educate Pm:ప్రధాని మోడీ (modi) విద్యార్హతపై వివాదం కొనసాగుతోంది. విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఇటీవల ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) మాట్లాడారు. దేశానికి చదువుకున్న ప్రధాని (prime minister) కావాలి.. అలా అయితే దేశాభివృద్ది సాధ్యం అవుతుందని తెలిపారు. కేజ్రీవాల్ (kejriwal) కామెంట్లకు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (manish sisodia) మద్దతు పలికారు. ఈ మేరకు జైలు నుంచి ఆయన ప్రధాని మోడీకి (modi) లేఖ రాశారు. ఆ లేఖ ప్రతీని కేజ్రీవాల్ (kejriwal) ట్వీట్ చేశారు.
‘దేశానికి చదువుకున్న ప్రధానమంత్రి (prime minister) కావాలి. దీంతో దేశాభివృద్ది సాధ్య పడుతుందన్నారు. మోడీ (modi) విద్యార్హత గురించి పరోక్షంగా ఇలా రాశారు. మురికి కాలువ నుంచి వాయువు తీసుకొని ఆ గ్యాస్ ద్వారా టీ లేదంటే ఆహారం తయారు చేస్తామా..? లేదు చేయబోం. విమానాలు మేఘాల వద్ద వెనక ఉన్న సమయంలో రాడార్లు పట్టుకోలేవని ప్రధాని మోడీ చెప్పినప్పుడు ప్రపంచం అంతా నవ్విందని చెప్పారు. స్కూల్, కాలేజీల్లో విద్యార్థులు నవ్వుకున్నారు’ అని సిసోడియా తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియా తీహర్ ప్రస్తుతం జైలులో ఉన్నారు.
ఇటీవల ఓ వీడియో చూశానని మనీష్ సిసోడియా వివరించారు. గ్రామాల్లో చదువుకున్నానని పేర్కొన్నారు. గర్వంగా గ్రామీణ పాఠశాలల్లో చదివానని చెప్పుకోవచ్చు కదా అని అడిగారు. తక్కువ చదివామనే అపప్రద కన్నా.. అసలు చదవలేమనే మాటల కన్నా.. ఇదీ బెటర్ కదా అని చెప్పారు.
దేశంలోని యువత ఆశయాలను తక్కువ చదువుకున్న ప్రధాని నెరవేర్చగలడా అని సిసోడియా అడిగారు. దేశంలోని యువత ఉత్సాహాంతో ఉన్నారు. ఏదో సాధించాలని అనుకున్నారు. మంచి అవకాశాల కోసం చూస్తున్నారు. ప్రపంచాన్ని గెలవాలని అనుకుంటున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అద్భుతాలు ఆవిష్కరించాలని అనుకుంటున్నారు. మరి వారి లక్ష్యాలను విద్యార్హత లేని ప్రధాని నెరవేర్చగలడా అని సిసోడియా సూటిగా ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 60 వేల స్కూళ్లను మూసివేశారని సిసోడియా తెలిపారు.