Kcrకు పోయేకాలం దగ్గరపడింది.. అందుకే వేధింపులు: ఈటల రాజేందర్
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ముఖ్య నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఆయనకు పోయే కాలం దగ్గరపడిందని చెప్పారు. అందుకే పోలీసుల చేత వేధింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.
KCR’s time is near:తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ముఖ్య నేత ఈటల రాజేందర్ (etala rajender) మండిపడ్డారు. ఆయనకు పోయే కాలం దగ్గరపడిందని చెప్పారు. అందుకే పోలీసుల (police) చేత వేధింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. పదో తరగతి హిందీ పేపర్ (hindi paper) లీకేజీ కేసులో నోటీసులు ఇవ్వడంపై ఈటల రాజేందర్ (etala rajender) మాట్లాడారు. తనకు నోటీసులు (notice), జైళ్లు (jails) కొత్త కాదని స్పష్టంచేశారు. వేధించడానికి నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.
టెక్నాలజీకి (technology) తాను అప్డేట్ కాలేదని ఈటల రాజేందర్ (etala rajender) తెలిపారు. మెసేజ్‌లు (message) చూడనని.. రిప్లై (replay) కూడా ఇవ్వనని చెప్పారు. ఎవరో తనకు పేపర్ వాట్సాప్ చేస్తే.. దానిని తాను చూడకపోయినా నోటీసులు (notice) ఇచ్చారని మండిపడ్డారు. ఇదీ మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
వరంగల్ డీసీపీ ఆఫీసు (warangal dcp offcie) వద్దకు శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఈటల రాజేందర్‌కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. పీఏలు రాజు (raju), నరేందర్‌కు (narender) కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందాయని.. 10వ తేదీన (సోమవారం) విచారణకు హాజరవుతానని తెలిపారు.
సింగరేణిని అప్పుల కుప్పగా మార్చారని ఈటల రాజేందర్ (etala rajender) మండిపడ్డారు. రూ.10 వేల కోట్ల అప్పు ఎలా అయ్యిందని అడిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి సింగరేణిలో 63 వేల మంది ఉద్యోగులు ఉన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ సంఖ్య 43 వేలకు పడిపోయిందని చెప్పారు. కోల్ ఇండియాలో ఒక్కో కార్మికుడికి రూ.900కు పైగా ఇస్తుంటే సింగరేణిలో రూ.430 ఇచ్చి శ్రమ దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.