SSC paper leak:పదో తరగతి హిందీ పేపర్ లీకేజీకి (hindi paper leak) రాజకీయ రంగు పలుముకుంది. ఈ కేసులో ఇప్పటికే బండి సంజయ్‌ను (bandi sanjay) అరెస్ట్ చేయగా.. రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఆ రోజు ఉదయం బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు (etala rajender) కూడా కొశ్చన్ పేపర్ వాట్సాప్ చేశారని పోలీసులు అంటున్నారు. ఆ అంశంపై నోటీసులు ఇచ్చారు. మేడ్చల్ జిల్లా పూడూరు ఓఆర్ఆర్ పక్కన గల ఈటల రాజేందర్ నివాసంలో నోటీసులు అందజేశారు.
వరంగల్ డీసీపీ ఆఫీసు (warangal dcp offcie) వద్దకు శుక్రవారం (రేపు) ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పీఏలు రాజు (raju), నరేందర్‌కు (narender) పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇదే అంశంపై ఈటల రాజేందర్ స్పందించారు. నోటీసులు అందాయని.. 10వ తేదీన (సోమవారం) విచారణకు హాజరవుతానని తెలిపారు.
తనకు వాట్సాప్ వాడటం రాదని ఈటల రాజేందర్ (etala rajender) పదే పదే చెబుతున్నారు. ఫోన్ వస్తే మాట్లాడతా.. అవసరం ఉంటే ఎవరికైనా ఫోన్ చేస్తా అని తెలిపారు. వాట్సాప్ మెసేజ్ ఓపెన్ చేయనని.. అవసరం ఉంటే పీఏలే చూస్తారని పేర్కొన్నారు. ఇదే విషయం ఓ టీవీ చానెల్ డిబెట్లో కూడా ప్రస్తావించారు. పోలీసులు మాత్రం ఈటల రాజేందర్‌కు కూడా పేపర్ వచ్చిందని.. విచారిస్తామని అంటున్నారు.