ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇవాళ రాష్ట్ర మంత్రి సీతక్క ముందస్తు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సంక్రాంతి అంటే పతంగుల పండుగ అని, ఆనందంగా సురక్షితంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. చైనీస్ మాంజా దారాల వాడకం వల్ల ప్రాణాపాయం ఉందని హెచ్చరించారు.